Share News

Sharad Pawar Vs Fadnavis: ప్రజల్లో ఆనందం లేదన్న పవార్, ఫలితాలను హుందాగా ఒప్పుకోవాలన్న ఫడ్నవిస్

ABN , Publish Date - Dec 07 , 2024 | 09:49 PM

కొల్హాపూర్‌లో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. విపక్షాలు దీనిపై ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Sharad Pawar Vs Fadnavis: ప్రజల్లో ఆనందం లేదన్న పవార్, ఫలితాలను హుందాగా ఒప్పుకోవాలన్న ఫడ్నవిస్

ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరినప్పటికీ ఎన్నికల ఫలితాలపై విపక్ష ''మహా వికాస్ అఘాడి'' (MVA) కొత్త పల్లవి అందుకుంది. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరని, ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయని కూటమి భాగస్వామ్య పార్టీలు అసంతృప్తి వెల్లగక్కుతున్నాయి. తాజాగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదన్నారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతే వేగంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా స్పీకరించాలని సీనియర్ పవార్‌కు హితవు పలికారు.

Maharashtra: ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించిన ఎంవీఏ ఎమ్మెల్యేలు


విపక్షాలు ఆందోళన చెందాల్సిన పనిలేదు: పవార్

కొల్హాపూర్‌లో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'మహాయుతి' సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేలా మహా వికాస్ అఘాడి కృషి చేయాలని సూచించారు.


ఫడ్నవిస్ కౌంటర్

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎలాంటి ఆనందం కనిపించడం లేదంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో తిప్పికొట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 1,49,13,914 ఓట్లు వచ్చినప్పటికీ కేవలం 9 సీట్లు గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ 96,41,856 ఓట్లతో 13 సీట్లు, ఎన్‌సీపీ-పవార్ వర్గం 58,51,166 ఓట్లతో 8 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. పవార్ హుందాగా అసెంబ్లీ ఎన్నికల ఓటమిని, ఫలితాలను అంగీకరించాలని హితవు పలికారు. ప్రజల మనోభావాలను, ఎన్నికల ట్రెండ్స్‌ను అర్ధం చేసుకుని అందుకు తగినట్టుగా అత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా పార్టీ సహచరులను పవార్ ప్రోత్సహించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...

Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 09:51 PM