Viral Video: జలపాతం చూసేందుకు వెళ్లి వరదలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ
ABN , Publish Date - Jul 01 , 2024 | 09:06 AM
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వర్షాలు(rains) జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ముగ్గురు మృత్యువాత చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వర్షాలు(rains) జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ముగ్గురు మృత్యువాత చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra) పూణె(pune) లోనావాలా(Lonavala) ప్రాంతంలోని భూషీ డ్యామ్(Bhushi Dam) సమీపంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పలువురు పెద్ద ఎత్తున వస్తున్న నీటి ప్రవాహంలో కొట్టుకోవడం కనిపిస్తుంది.
పెళ్లికొచ్చిన వారితో కలిసి
ఇక వివరాల్లోకి వెళితే సయ్యద్ నగర్‌కు చెందిన అన్సారీ ఫ్యామిలీలో 16 నుంచి 17 మంది లోనావాలా సమీపంలోని పర్యాటక ప్రాంతం(tourist place) జలపాతాలు చూసేందుకు ప్రైవేట్ బస్సులో ఆదివారం వెళ్లారు. ఆ క్రమంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆకస్మాత్తుగా పెద్ద వరద వచ్చింది. దీంతో ఆ జలపాతానికి సమీపంలో ఉన్న దాదాపు 10 మంది కొట్టుకుపోయారని లోనావాలా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుహాస్ జగ్తాప్ తెలిపారు. కాగా వారిలో కొందరు తప్పించుకోగా, మరో బాలికను పలువురు రక్షించారని అన్నారు. కొద్దిరోజుల క్రితం ముంబై నుంచి తన బంధువులు పెళ్లి కోసం వచ్చారని వారితో కలిసి ఆదివారం పిక్నిక్ కోసం లోనావాలాకు వెళ్లారని అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న..
మృతులను షాహిస్తా లియాఖత్ అన్సారీ (36), అమీమా ఆదిల్ అన్సారీ (13), ఉమేరా ఆదిల్ అన్సారీ (8)గా పోలీసులు గుర్తించారు. సెర్చ్ టీమ్ రిజర్వాయర్ దిగువ ప్రవాహం నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అద్నాన్ సబాహత్ అన్సారీ (4), మరియా అకిల్ అన్సారీ (9) ఇంకా కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్(search operation) నిర్వహించారు. వారి కోసం సోమవారం కూడా అన్వేషణ కొనసాగుతుంది.
హెచ్చరికలు ఉన్నప్పటికీ..
ఈ క్రమంలో లోనావాలాకు ఆదివారం 50,000 మందికి పైగా వచ్చినట్లు పోలీసులు(police) తెలిపారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రజలు భూషీ డ్యామ్‌పై ఉన్న కొండ ప్రాంతంలో ప్రమాదకరమైన ప్రాంతాలను సందర్శిస్తూనే ఉన్నారని చెప్పారు. హెచ్చరికలను పట్టించుకోకుండా భూషి డ్యామ్ ప్రాంతానికి జలపాతం కింద సరదాగా గడిపేందుకు వస్తున్నారన్నారు. వర్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఇక్కడికి వస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో లోనావాలా, ఖండాలా, పవన డ్యామ్ ప్రాంతాలను సందర్శించవద్దని పుణె రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి:
LPG Gas: గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
Hyderabad: ఛీ.. ఛీ.. కాపాడాల్సిన పోలీసే..కామవాంచతో బాలికపై అత్యాచారం
For Latest News and Crime News click here