LPG Gas: గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
ABN , Publish Date - Jul 01 , 2024 | 07:37 AM
కేంద్ర బడ్జెట్‌కు ముందు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్( LPG cylinders) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
కేంద్ర బడ్జెట్‌కు ముందు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్( LPG cylinders) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్చబడిన LPG ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. కానీ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.
ఏ నగరాల్లో ఎంత రేట్లు..
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. దీంతో ఢిల్లీ(delhi)లో 19 కిలోల LPG గ్యాస్( LPG gas) ధర రూ.1646గా మారగా, తెలంగాణలోని హైదరాబాద్(hyderabad)లో 19 కిలోల LPG గ్యాస్ ధర 72 రూపాయలు తగ్గి రూ. 1903.50కి చేరింది. ఏపీలోని విజయవాడ(vijayawada)లో రూ.32 తగ్గి రూ.1832.50కి చేరుకుంది. మరోవైపు ఈ సిలిండర్ కోల్‌కతాలో రూ.1756కి అందుబాటులో ఉండగా, ముంబైలో రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809గా ఉన్నాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధరలు
14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో(domestic gas cylinder price) ఎలాంటి మార్పు లేదు. ఇది ఢిల్లీలో రూ. 803, హైదరాబాద్‌లో రూ.855, ఏపీలోని అమరావతిలో రూ.844.50, కోల్‌కతాలో రూ. 829, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ.818.50కి అందుబాటులో ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ. 603కే ఈ సిలిండర్ లభించనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.72 తగ్గించాయి. ఆ తర్వాత ఢిల్లీలో రూ.1676, కోల్‌కతాలో రూ.1787, ముంబైలో రూ.69.50 తగ్గిన సిలిండర్ రూ.1629, చెన్నైలో రూ.1840.50కి చేరింది. ఇప్పుడు జూలైలో రూ.30 తగ్గింది.
ఇది కూడా చదవండి:
Gold and Silver Prices Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఓలా ఈ-స్కూటర్లలో.. ఇక ఓలా బ్యాటరీలు
పెళ్లిళ్ల వ్యాపారం.. ఏటా రూ.10 లక్షల కోట్లు
For Latest News and Business News click here