SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Jan 19 , 2024 | 10:12 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్న మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ (PM Modi) ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్న మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు ఉంటారు. జనవరి 23వ తేదీన కమిటీ భేటీ కానున్నది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.