Former CM: మాజీసీఎం ధ్వజం.. బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆయనే కారణం..
ABN , Publish Date - Jul 06 , 2024 | 11:45 AM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు.
- ఎడప్పాడి ధ్వజం
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నామలై కారణమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ధ్వజమెత్తారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాబలం అధికమైందంటూ అన్నామలై అధిష్టానవర్గానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన మాయమాటలను నమ్మి ఆ పార్టీ జాతీయ నేతలు మోసపోయారని ఆరోపించారు. విక్రవాండి ఉప ఎన్నికలను అన్నాడీఎంకే బహిష్కరించడం సబబైన నిర్ణయమేనని, ఆ ఎన్నికల్లో పోటీచేస్తే నాలుగోస్థానం కూడా రాదంటూ అన్నామలై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నామలై వచ్చాకే రాష్ట్రంలో బీజేపీ(BJP) బాగా పుంజుకున్నట్లు మాయ సృష్టించి అధిష్టానాన్ని మోసగించారని. వాస్తవానికి 2014 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్ శాతం బాగా తగ్గిందని పేర్కొన్నారు. కోయంబత్తూరు ఓటర్లకు అన్నామలై ప్రకటించిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దల సాయంతో నెరవేర్చాలని ఈపీఎస్ సూచించారు.
ఇదికూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ మాజీసీఎం నమ్మక ద్రోహి...
శశికళకు సలహా...
అన్నాడీఎంకేలో అన్ని వర్గాలను విలీనం చేస్తానంటూ వింత ప్రకటనలు జారీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఎంజీఆర్ సతీమణి జానకిని ఆదర్శంగా తీసుకుని రాజకీయ సన్యాసం చేయాలని ఈపీఎస్ సలహా ఇచ్చారు. గతంలో జానకి రామచంద్రన్ మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతునిస్తున్నానని ప్రకటించి ఆమె నాయకత్వంలో అన్నాడీఎంకే పుగోమిస్తుందంటూ ప్రకటించి రాజకీయాల నుంచివైదొలగారని, ఆ రీతిలోనే శశికళ కూడా ఓ ప్రకటన చేసి రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News