Taranjit Singh Sandhu: యూఎస్‌లో ఇండియా మాజీ రాయబారి బీజేపీలో చేరిక.. అమృత్‌సర్ నుంచి పోటీ?
ABN , Publish Date - Mar 19 , 2024 | 05:43 PM
అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు మంగళవారంనాడు అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు (Taranjit Singh Sandhu) మంగళవారంనాడు అధికారికంగా బీజేపీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
అమృత్‌సర్ నుంచి పోటీ..
కాగా, బీజేపీలో అధికారికంగా చేరిన తరణ్‌జిత్ సింగ్‌కు పంజాబ్‌లోని అమృత్ సర్ నుంచి లోక్‌సభ టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమృత్‌సర్ నుంచి ఆప్ అభ్యర్థిగా కుల్దీప్ సింగ్ ధలివాల్ పోటీలో ఉన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన సంధూ
కాగా, పార్టీలో తనకు అవకాశం కల్పించిన బీజేపీ అధినాయకత్వానికి సంధు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవలు అందించేందుకు వీలుగా తన కొత్త జర్నీ మొదలవుతోందన్నారు. తనను ప్రోత్సహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు చెప్పారు. ''గత పదేళ్లుగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వానికి చాలా దగ్గరగా పనిచేశారు. ముఖ్యంగా అమెరికా, శ్రీలంకతో సంబంధాలపై పనిచేశాను. అభివృద్ధి అంశంపై ప్రధాని ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇవాళ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఇదే అభివృద్ధి అమృత్‌సర్‌కు కూడా చేరాలి'' అని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.