లోకాయుక్త ఎదుట యడియూరప్ప హాజరు
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:19 AM
డీ నోటిఫికేషన్ వివాదంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): డీ నోటిఫికేషన్ వివాదంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు లోకాయుక్త ఆయనను విచారించింది. కేంద్రమంత్రి కుమారస్వామి, యడియూరప్ప డీ నోటిఫికేషన్ వివాదంలో నిందితులుగా ఉన్నారు. ఎ-1 నిందితుడు యడియూరప్పకు లోకాయుక్త సమన్లు జారీ చేయడంతో ఆయన విచారణకు వెళ్లారు. బెంగళూరు గంగానగర్‌లో ఎకరం భూమిని మృతి చెందినవారి పేరిట అక్రమంగా డీ నోటిఫై చేసినట్లు కేసు నమోదైంది. 2007లో ముఖ్యమత్రిగా కుమారస్వామి ఉన్న సమయంలో డీ నోటిఫికేషన్‌కు ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత 2010లో యడియూరప్ప సీఎం అయ్యాక ఈ ప్రక్రియను ముగించారు. ఇదే వివాదంలో కేంద్రమంత్రి కుమారస్వామి పేరు ఉన్నా, ఆయనకు ఎటువంటి నోటీసులు అందలేదని సమాచారం.