Share News

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:35 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్‌ వైద్యులు దృవీకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు.

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్‌ వైద్యులు దృవీకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు.


దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.

Updated Date - Dec 26 , 2024 | 11:35 PM