Share News

Arvind Kejriwal: 60 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వైద్యం

ABN , Publish Date - Dec 18 , 2024 | 03:38 PM

'సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు.

Arvind Kejriwal: 60 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వైద్యం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లు అందరికీ ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందిస్తామని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvnind Kejriwal) బుధవారంనాడు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన' (Sanjeevani Yojana) కింద ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పారు. ''ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మాకు ఉంది. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో మీరంతా ఎంతో కష్టపడుతున్నారు'' అని కేజ్రీవాల్ అన్నారు.

Modi-Rahul Gandhi: మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?


వైద్య ఖర్చుకు పరిమితి లేదు

'సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు. ఆప్ కార్యక్రమలే స్వయంగా ఇంటింటికి వెళ్లి పేరు రిజిస్టర్ చేస్తారని, అనతంరం ఒక కార్డు ఇస్తారని, దానిని భద్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామని వాగ్దానం చేశారు.


ఈసీ కసరత్తు

కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గాను 'ప్రిపరేటరీ మీటింగ్‌'ను భారత ఎన్నికల కమిషన్ (ECI) ఈవారంలో నిర్వహించనుంది. ఈ సమావేశానంతరం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు

Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

For National News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 03:38 PM