Share News

Ghaziabad: గజియాబాద్ పేరు మార్పునకు కార్పొరేషన్ ఆమోదం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:27 PM

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతోన్న వేళ అంతటా భక్తి భావం నెలకొంది. ఇంతలో గజియాబాద్ పేరు మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను మున్సిపాలిటీ ఆమోదం తెలిపింది.

 Ghaziabad: గజియాబాద్ పేరు మార్పునకు కార్పొరేషన్ ఆమోదం

గజియాబాద్: అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతోన్న వేళ అంతటా భక్తి భావం నెలకొంది. రాములొరి అక్షింతలు అందరికీ చేరుతున్నాయి. అయోధ్యకు వెళ్లే ప్రయత్నాల్లో చాలామంది ఉన్నారు. ఇంతలో గజియాబాద్ (Ghaziabad) పేరు మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను మున్సిపాలిటీ ఆమోదం తెలిపింది.

సభ ముందు ప్రతిపాదన రాగానే ఒక్కసారిగా జై శ్రీరాం అనే నినాదాలు వినిపించాయి. వందే భారత్, భారత్ మాతా కీ జై అని సభ్యులు గట్టిగా నినాదించారు. మున్సిపల్ కార్యాలయంలో కేవలం ఇద్దరు మాత్రమే పేరు మార్పును వ్యతిరేకించారు. మిగతా సభ్యులు అందరూ ఆమోదం తెలుపడంతో ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. గజియాబాద్ (Ghaziabad)పేరును హర్‌నంది నగర్ లేదంటే గజ్ నగర్‌గా మార్చే అవకాశం ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం పేరును ఖరారు చేయనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 04:27 PM