Rahul Gandhi: వెల్లుల్లి కంటే బంగారం ధరే చౌక.. కూరగాయల మార్కెట్లో రాహుల్
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:33 PM
న్యూఢిల్లీలోని గిరి నగర్ కూరగాయల మార్కెట్‌కు రాహుల్ గాంధీ ఇటీవల వెళ్లారు. అక్కడి కొనుగోలుదారులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై చర్చించారు.
న్యూఢిల్లీ: చుక్కలనంటుతున్న కూరగాయల ధరలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై విమర్శలు కురిపించారు. ధరలు ఇలా మండిపోతుంటే సామాన్యుడు తినే విషయంలోనూ రాజీ పడాల్సి వస్తోంది. ఇక పొదుపు చేసేదేముంటుంది? అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని గిరి నగర్ కూరగాయల మార్కెట్‌కు రాహుల్ గాంధీ ఇటీవల వెళ్లారు. అక్కడి కొనుగోలుదారులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
Delhi Assembly Elctions: సీఎంపై పోటీకి దిగుతున్నదెవరంటే..
''కొద్ది రోజుల క్రితం నేను స్థానిక మార్కెట్‌కు వెళ్లాను. కూరగాయలు కొనుగోలు చేస్తున్న సామాన్యులతో మాట్లాడాను. పెరుగుతున్న ధరలతో వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ అవసరాల విషయంలోనూ రాజీ పడుతున్నారు. వెల్లుల్లి రూ.400, బఠానీలు కేజీ 120 పలుకుతోంది. ఇలా అయితే ప్రజలు ఏమి తింటారు? ఏమి సేవింగ్ చేస్తారు?. సామాన్య ప్రజల వంటగది బడ్జెట్ వారి చేయి దాటిపోతుంటే ధరలను నియంత్రించకుండా కేంద్ర కుంభకర్ణుడిలా నిద్రపోతోంది" అని రాహుల్ విమర్శించారు.
కూరగాయల మార్కెట్ లో రాహుల్ ఒకరిని వెల్లుల్లి ధర ఎంత అని అడగ్గా ఆమె "వెల్లుల్లి కంటే బంగారం ధరే చౌక" అంటూ ఆకాశాన్నంటున్న కూరగాయ ధరలపై వాపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్ట్ చేస్తూ.. నెటిజన్లను కూడా మండిపోతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలపై తమ అనుభవాలను పోస్ట్ చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..
NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు
For National News And Telugu News