Share News

Ayodhya: రామయ్య గర్భాలయానికి బంగారు తలుపులు.. త్వరలోనే మరికొన్ని సైతం..

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:39 PM

అయోధ్య రామాలయ ప్రారంభానికి కొద్ది రోజులే ఉండటంతో.. ఆలయ తుది దశ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలో

Ayodhya: రామయ్య గర్భాలయానికి బంగారు తలుపులు.. త్వరలోనే మరికొన్ని సైతం..

అయోధ్య రామాలయ ప్రారంభానికి కొద్ది రోజులే ఉండటంతో.. ఆలయ తుది దశ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలో మందిరంలోని మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి వద్ద 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు తలుపును అమర్చారు. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఉండనుండగా వాటిలో 42 తలుపులకు బంగారు పూత పూయనున్నట్లు తెలిపింది.

రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22 న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ప్రారంభోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్యమంత్రి తెలిపారు. వేడుకల సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యకు వచ్చిన ఆయన.. పరిశుభ్రతలో అయోధ్య రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు. పవిత్రోత్సవాల సందర్భంగా నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాలని కోరారు.

కాగా.. జనవరి 22 న అయోధ్య ఆలయంలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానితుల జాబితాలో రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు సహా ఏడువేల మంది పైగా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 03:39 PM