Rahul Gandhi: కేంద్రం కొత్త పన్ను శ్లాబ్‌తో జీఎస్‌టీ బాదుడు: రాహుల్
ABN , Publish Date - Dec 07 , 2024 | 09:02 PM
దుస్తుల ఖరీదు రూ.1,500 దాటితే జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, ఇది నేరుగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారిపై ప్రభావం చూపుతుందని రాహుల్ తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఇది పెనుభారం అవుతుందన్నారు.
న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ (GST) పెంచుతూ కొత్త పన్ను స్లాబ్ (New tax slab)ను కేంద్రం సిద్ధం చేస్తోందని, ఇందువల్ల సామాన్య ప్రజానీకంపై భారం పడనుందని అన్నారు. సంపన్నులకు ఉపశమనం కలిగిస్తూ పేదలపై పన్నుల భారం మోపుతోందంటూ కేంద్రాన్ని తప్పుపట్టారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ విషయం ఆయన వెల్లడించారు.
Bomb Threat: మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
''క్యాపిటలిస్టులకు రాయితీలు ఇస్తూ సాధారణ ప్రజానీకానీకి కేంద్రం ఏ విధంగా లూటీ చేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. ఒకవైపు కార్పొరేట్ పన్నులతో పోలిస్తే ఆదాయం పన్ను నిరంతరం పెంచుతూ, మరోవైపు 'గబ్బర్ సింగ్' పాలనలో మరిన్ని వసూళ్లు రాబట్టేందుకు మోదీ సర్కార్ కసరత్తు జరుగుతోంది'' అని రాహుల్ అన్నారు. నిత్యావసరాలపై మోదీ సర్కార్ కొత్త పన్ను శ్లాబ్‌కు యోచన చేస్తోందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు.
దుస్తుల ఖరీదు రూ.1,500 దాటితే జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, ఇది నేరుగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారిపై ప్రభావం చూపుతుందని రాహుల్ తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఇది పెనుభారం అవుతుందన్నారు. పెళ్లిళ్లు అంటే కొత్త బట్టల కొనుగోలుకు నెలల తరబడి డబ్బులు కూడబెట్టుకుంటారని, రూ.1,500కు పైబడి కొనుగోళ్లపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీని 18 శాతం పెంచడం పూర్తిగా అన్యాయమవుతుందని పేర్కొన్నారు. ధనకులు, పేదలకు మధ్య వ్యత్యాసం అంతకంతకూ పెరిగిపోతోందన్నారు. బిలయనీర్లకు పెద్దమొత్తంలో రుణాలు మాఫీ చేస్తూ చొమటోడ్జి సంపాదించుకునే సాధారణ ప్రజానీకాంపై మాత్రం ప్రభుత్వం భారీగా పన్నుల వడ్డన చేస్తోందని విమర్శించారు. బిలియనీర్లకు ట్యాక్స్ బ్రేక్‌లు, రుణమాఫీలను ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రజానీకంపై పడే పన్నుల భారం, వారికి జరుగుతున్న అన్యాయంపై తాము గళం విప్పుతూనే ఉంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య
Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..
Read More National News and Latest Telugu News