Share News

PM Modi: మోదీ ప్రమాణస్వీకారానికి రాబోయే దేశాధినేతలు వీరే!

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:19 PM

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్కుని (272) దాటేసి 293 సీట్లు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు..

PM Modi: మోదీ ప్రమాణస్వీకారానికి రాబోయే దేశాధినేతలు వీరే!
Guest List For Narendra Modi Oath Taking Ceremony

2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్కుని (272) దాటేసి 293 సీట్లు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఆదివారం (జూన్ 9) రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7:15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్‌లోని ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.


Read Also: మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సైతం ఢిల్లీకి బయలుదేరారు. అలాగే.. మాల్దీవుల అధ్యక్షుడు డా. మహమ్మద్ మొయిజ్జు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఢిల్లీకి రాబోతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. ఈ అతిరథ మహారథుల కోసం తాజ్, లీలా, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్ వంటి హోటళ్లను భద్రత పరిధిలోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు, NSG, SWAT కమాండోలను సైతం రాష్ట్రపతి భవన్‌తో పాటు పలు కీలక ప్రదేశాల చుట్టూ మోహరించబోతున్నారు.


Read Also: నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?

ఇదిలావుండగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్డీఏ కూటమిలోని ఎంపీలందరూ సమావేశమై, నరేంద్ర మోదీని కూతమి పక్ష నేతగా ఎంపిక చేసుకున్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని శుక్రవారం జరిగిన ఈ భేటీలో.. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేనాధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం హాజరయ్యారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, లేఖలను నరేంద్ర మోదీ జూన్ 7వ తేదీన సమర్పించిన తర్వాత.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను అధికారికంగా కోరారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 10:35 PM