Viral Video: బ్యాంక్‌లో మేనేజర్, కస్టమర్ డిష్యూం డిష్యూం..
ABN , Publish Date - Dec 08 , 2024 | 07:28 PM
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అధికంగా టీడీఎస్ కట్ కావడంతో.. కస్టమర్ జైమన్ రావల్ కోపోద్రుక్తుడయ్యాడు. ఆ క్రమంలో బ్యాంక్ మేనేజర్‌పై కస్టమర్ జైమర్ రావల్ దాడి చేశారు. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి దాని మీద జీఎస్టీనే.. తిన్నా.. తాగినా.. సినిమాకి వెళ్లినా.. మందు బిళ్ల కొనుక్కున్న అన్నింటి మీద జీఎస్టీనే. ఇక మనం కష్టపడి సంపాదించుకున్న నగదు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకున్నా.. దానికి సైతం పన్ను పోటు తప్పడం లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే తాను దాచుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్‌లో అధిక మొత్తంలో టీడీఎస్ కట్ అయింది.
దీంతో సదరు కస్టమర్‌కి కోపం తారస్థాయికి చేరింది. దాంతో బ్యాంక్ మేనేజర్‌పై సదరు కస్టమర్ దాడి చేశారు. ఆ క్రమంలో అటు బ్యాంక్ మేనేజర్, ఇటు కస్టమర్ ఇద్దరు.. ఎవరు తగ్గేదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతో వారిని వేరు చేసేందుకు బ్యాంక్ సిబ్బంది ప్రయత్నించారు.
Also Read: Viral Video: మామగారిని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్
దీంతో మరోవ్యక్తిపై కస్టమర్ దాడికి యత్నించారు. ఇక కస్టమర్‌కు చెందిన మహిళ అయితే.. అతడిని నియంత్రించేందుకు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. ఆ క్రమంలో అతడిపై చెయ్యి సైతం చేసుకుంది. అనంతరం ఇరువురిని బ్యాంక్ సిబ్బంది పట్టుకుని వేర్వేరుగా కూర్చోబెట్టారు. అయితే కస్టమర్ పక్కన కూర్చున్న యువతి కన్నీటి పర్యంతమయింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను తెగ చుట్టేస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఇటీవల ఈ చోటు చేసుకుంది.
Also Read: తెలంగాణ భవన్‌లో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు
Also Read: కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
యూనియన్ బ్యాంక్‌లో జైమన్ రావల్ ఎఫ్ డి కింద కొంత నగదు జమ చేసుకున్నారు. అయితే దానికి టీడీఎస్ కట్ కావడం.. అది కూడా అధిక మొత్తంలో కట్ కావడంతో.. అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే... వచ్చే ఆదాయంలో కొంత మేర ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఓ వేళ.. 15 హెచ్ ఇచ్చినా ట్యాక్స్ డిడక్షన్ కాదు. కానీ అవి ఇచ్చినా.. ట్యాక్స్ కట్ అయి ఉంటుందని అందుకే అతడు అంతలా ప్రతి స్పందించారనే వాదన నెటిజన్లు నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు వస్త్రాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తిరుమల బాహుబలి తీర్థం విశిష్టతలు తెలుసా..?
Also Read: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..
ఇంకోవైపు బిహార్ రాజధాని పాట్నాలో గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో సిబిల్ స్కోర్ విషయంలో ఒక మహిళా బ్యాంక్ మేనేజర్‌ని వేధింపులకు గురి చేసి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
For National News And Telugu News