Haryana Assembly polls: అసెంబ్లీ ఎన్నికల నగారా.. హర్యానాలో ఈసీ పర్యటన
ABN , Publish Date - Aug 12 , 2024 | 08:16 PM
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని ఈసీఐ బృందం సోమవారంనాడు చండీగఢ్ చేరుకుంది.
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly polls) నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని ఈసీఐ బృందం సోమవారంనాడు చండీగఢ్ చేరుకుంది. రాజీవ్ కుమార్ వెంట ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధు కూడా ఉన్నారు.
కాగా, 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 3వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన 8 రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. ఈసారి హర్యానా ఎన్నికల బరిలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డి), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే 90 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించింది.
Coaching centres: కోచింగ్ సెంటర్లకు గైడ్‌లైన్స్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
గత ఫలితాలివే..
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 31 సీట్లు, జేజేపీ 10 సీట్లు, ఐఎన్ఎల్‌డీ ఒక సీటు గెలుచుకున్నాయి. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ లోగా జరిగే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు.
Read More National News and Latest Telugu News