Share News

Vinesh Phogat: వరించిన అదృష్టం.. మల్లయోధురాలు ఘన విజయం..

ABN , Publish Date - Oct 08 , 2024 | 01:52 PM

Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 4వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలు వినేశ్ ఫోగట్..

Vinesh Phogat: వరించిన అదృష్టం.. మల్లయోధురాలు ఘన విజయం..
Vinesh Phogat

Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 4వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఫోగట్.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో ముందంజలో దూసుకుపోయారు. ఆ తరువాత రౌండ్లలో స్వల్పంగా వెనకపడ్డారు. మొదటి ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి కొంచెం వెనుకపడిన ఫోగట్.. 8వ రౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని కనబర్చారు.


8,9,10, 11, 12 రౌండ్లలో ఆధిక్యం రావడంతో 12 రౌండ్లు ముగిసే సమయానికి 4వేలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని ఫోగట్ సాధించారు. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీకి మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఉంది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన ఫలితాల ప్రకారం బీజేపీ 49 స్థానాలో, కాంగ్రెస్ 35 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డీ ఒకటి, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటినుంచి బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరిగింది. రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే మాత్రం హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్క్ సాధించకపోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో అందరినీ దృష్టిని ఆకర్షించిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆమె గెలుపుదిశగా అడుగులు వేస్తున్నారు.


ఫోగట్ ఘన విజయం..

పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బరువు ఎక్కువుగా ఉన్నారనే కారణంగా ఆమె ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌ తర్వాత ఆమె పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు రెజ్లర్ల ఉద్యమంలో ఫోగట్ కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. రైతు చట్టాల విషయంలోనూ, రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనలోనూ కేంద్రప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపడుతూ వచ్చారు. హర్యానా ఎన్నికల వేళ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెజ్లర్ భజరంగ్ పునియాతో కలిసి ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఆమెను బీజేపీ సైతం టార్గెట్ చేసింది. జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ తన అభ్యర్థిగా ఫోగట్‌ను ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ వేవ్‌ ఉందని, మరోవైపు ఫోగట్ హర్యానా బిడ్డ కావడంతో ఆమెపై సానుభూతి ఉందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కనిపించనప్పటికీ జులనాలో మాత్రం ఫోగట్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


Also Read:

ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి

వైసీపీ నేతల నయా స్కెచ్..!

మరోసారి అడ్డంగా దొరికిపోయిన సాక్షి..

For More National News and Telugu News..

Updated Date - Oct 08 , 2024 | 01:52 PM