PM Modi: హ్యాట్రిక్ విక్టరీతో ఆశీర్వదించండి
ABN , Publish Date - Sep 14 , 2024 | 05:59 PM
హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పగలనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో శనివారంనాడు ఆయన పాల్గొని ప్రసంగించారు.
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా (Haryana)లోనూ బీజేపీ (BJP)కి 'హ్యాట్రిక్' విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పగలనని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో మోదీ శనివారంనాడు పాల్గొని ప్రసంగించారు.
100 రోజులు కాకుండానే...
రైతులు, పేదలు, యువకులు, మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ''లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపై రైతులు, పేదలు, యువకులు, మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు భారీ నిర్ణయాలు తీసుకుంటామని నేను వాగ్దానం చేశాను. ఇంకా 100 రోజులు కూడా పూర్తికాకుండానే రూ.15 లక్షల కోట్ల పథకాలను మా ప్రభుత్వం ప్రారంభించింది. పేద కుటుంబాలకు 3 లక్షల పక్కా గృహాలకు ఆమోదం తెలిపాం' అని మోదీ తెలిపారు.
PM Modi: ఉగ్రవాదం అంపశయ్యపై ఉంది.. శాంతి, సుస్ధిరతలకు నాదీ భరోసా
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పనితీరుతో పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌తో మోదీ పోల్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. ఫలితంగా వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసలకు దిగుతున్నారని అన్నారు. కాగా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Read MoreNational News and Latest Telugu News
Rain Alert: 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. IMD హెచ్చరిక
Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..