Heavy rains: ముంచుకొస్తున్న ముప్పు
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:54 PM
రాజధాని నగరం చెన్నై(Chennai), సబర్బన్ ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. చెన్నై సెంట్రల్, గిండి, మాంబళం, మందవెల్లి, కోడంబాక్కం, అడయారు, బీసెంట్‌నగర్, తిరువాన్మియూరు,
- చెన్నై లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
చెన్నై: రాజధాని నగరం చెన్నై(Chennai), సబర్బన్ ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. చెన్నై సెంట్రల్, గిండి, మాంబళం, మందవెల్లి, కోడంబాక్కం, అడయారు, బీసెంట్‌నగర్, తిరువాన్మియూరు, చేపాక్, వడపళని, కోయంబేడు, మధురవాయల్, రాయపేట, మైలాపూరు(Rayapeta, Mylapore) తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
ఈ వర్షానికి సైదాపేట, ఆదంబాక్కం, ఆలందూరు, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. నందనంలో 4.5 సెం.మీ., అన్నా వర్సిటీ ప్రాంతంలో 4.4 సెం.మీ, మీనంబాక్కంలో 3.9 సెం.మీ, పళ్ళిక్కరణై ప్రాంతంలో 3. సెం.మీ వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం కారణంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట, రామనాఽథపురం జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
నేడు, రేపు కుండపోత
రాజధాని నగరం చెన్నైలో బుధ,గురువారాల్లో పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసే అవకాశముందని బాలచంద్రన్ తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోను, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్నారు.
జాలర్లకు హెచ్చరిక..
బంగాళాఖాతంలోని మన్నార్ జలసంధి, కన్నియాకుమారి తీరం సహా సముద్రతీర ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 45 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, అలల ఉధృతి కూడా అధికంగా ఉంటుందని, జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని స్థానిక వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
విమాన సేవలకు అంతరాయం..
మంగళవారం ఉదయం కురిసిన వర్షం కారణంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి ఢిల్లీ, ముంబాయి నగరాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ముప్పావుగంట ఆలస్యంగా బయలుదేరాయి. అదేవిధంగా హైదరాబాద్ వెళ్లే విమానాలు అరగంట ఆలస్యంగా బయలుదేరాయి.
12 జిల్లాలకు వర్షసూచన..
బుధవారం చెన్నై సహా 12 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని దక్షిణ మండల వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ బాలచంద్రన్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తుఫానుగా మారే అవకాశం లేదని, ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం కారణంగానే రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయన్నారు. బుధవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, మదురై, విరుదునగర్, రామనాఽథపురం, తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News