Heavy Snow Fall: భారీగా కురుస్తున్న మంచు.. పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Dec 30 , 2024 | 07:11 AM
భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అంతేకాదు ఈ ప్రభావం జనవరి 1, 2 తేదీల్లో కూడా ఉంటుందని అక్కడి వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇది ఎక్కడ ఉంది, ఎన్ని రోజులు ఉంటుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త సంవత్సరానికి ముందు జమ్మూ కశ్మీర్‌లో (Jammu Kashmir) మంచు భారీగా (HeavySnowfall) కురుస్తోంది. ఈ ప్రభావం జనవరి 1, 2 తేదీల్లో కూడా ఉంటుందని, కొన్ని కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 3, 6 తేదీల మధ్య కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ హిమపాతం ఉండవచ్చని వెల్లడించారు. దీంతో జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాలు కూడా ప్రభావితం కానున్నాయి.
మంచు తొలగింపు
వాతావరణం అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో ఆదివారం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిమపాతం కురిసింది. ఆ క్రమంలో మంచు తొలగింపు తర్వాత రెండో రోజు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. దీంతోపాటు దారిలో నిలిచిన వాహనాలను గమ్యస్థానం వైపు పంపించారు. బనిహాల్, ఖాజిగుండ్ మధ్య రోడ్లు జారడం కారణంగా, డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సేవలు రద్దు
ఇదే సమయంలో సింథాన్ రోడ్, సోన్‌మార్గ్-కార్గిల్ రోడ్, భదేర్వా-చంబా రోడ్‌తో పాటు జిల్లా రాజోరి, పూంచ్ నుంచి షోపియాన్ (కశ్మీర్) వరకు కలిపే మొఘల్ రోడ్‌లు ఇంకా మంచుతోనే ఉన్నాయి. వీటిని ఇంకా తెరువలేదు. వాతావరణం మెరుగుపడిన తరువాత శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభించబడ్డాయి. పర్యాటకులు, ప్రయాణికులు ట్రాఫిక్ విభాగం సలహా ప్రకారం ప్రయాణించాలని సూచించారు. అలాగే నేటి నుంచి రైలు సర్వీసులను కూడా పునరుద్ధరించారు. అయితే ఈ రోజు విస్టాడోమ్ సేవలు రద్దు చేయబడ్డాయి.
ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే..
ఈ క్రమంలో లోయలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉంది. ఆదివారం రాజధాని శ్రీనగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 4.7 డిగ్రీల నుంచి 4.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పహల్గామ్‌లో 5.8 డిగ్రీలు, గుల్‌మార్గ్‌లో 5.3 డిగ్రీల నుంచి మైనస్ 2.0 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. జమ్మూలో గరిష్ట ఉష్ణోగ్రత 20.5 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బనిహాల్‌లో 6.1 డిగ్రీల సెల్సియస్, బాటోట్‌లో 7.9, కత్రాలో 18.0, భదర్వాలో 10.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. లేహ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గుల్మార్గ్‌లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా ఉండటం విశేషం.
పరీక్షలు వాయిదా
ఈ మంచు కురిసే వెదర్ నేపథ్యంలో డిసెంబర్ 30న జరగాల్సిన కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. కాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో విపరీతమైన మంచు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మజిద్ జమాన్ తెలిపారు. పరీక్షలను సకాలంలో నిర్వహిస్తామన్నారు. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలు విడిగా జారీ చేయబడతాయన్నారు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More National News and Latest Telugu News