Jharkhand: హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం ఫిక్స్
ABN , Publish Date - Nov 27 , 2024 | 04:15 PM
హేమంత్ సోరెన్ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలు గెలుచుకుని రెండోసారి కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 24 స్థానాలు సొంతం చేసుకుంది.
రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘనవిజయం సాధంచడంతో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నవంబర్ 28వ తేదీ గురువారంనాడు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా 'ఇండియా' కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన హేమంత్ సోరెన్ ఇటీవల స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసి ఆహ్వానించారు.
Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే కొత్త షరతు...తెరపైకి శ్రీకాంత్ షిండే
హేమంత్ సోరెన్ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలు గెలుచుకుని రెండోసారి కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 24 స్థానాలు సొంతం చేసుకుంది. బర్హయిత్ నియోజకవర్గం నుంచి తిరిగి హేమంత్ సోరెన్ 39,491 ఓట్ల ఆధిత్యంతో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై గెలుపొందారు. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎఎం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా 34 సీట్లు గెలుచుకుంది. కూటమి భాగస్వాములైన కాంగ్రెస్-16, ఆర్జేడీ- 4, సీపీఐ (ఎంఎల్)- 2 సీట్లు గెలుచుకున్నాయి. కొత్తం ప్రభుత్వంలో ఆర్జేడీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది.
హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టేందుకు వీలుగా లెచిస్లేచర్ పార్టీ నేతగా ఆయనను 'ఇండియా' కూటమి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో గత ఆదివారంనాడు ఆయన గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్‌ను కలిసారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 2000 నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టడనుండటం ఇది నాలుగోసారి.
ఇవి కూడా చదవండి
Google Maps: ఉత్తరప్రదేశ్‌లో కారు ప్రమాదం... స్పందించిన గూగుల్
Nagendra: మళ్లీ కేబినెట్‌లోకి నాగేంద్ర..
Sanatan Board: 'సనాతన్ ధర్మ రక్షా బోర్డు' ఏర్పాటు పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
Read More National News and Latest Telugu News