Home » swearing-in ceremony
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు.
AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.
కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది.
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.
ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనుకోని అతిథి కనిపించింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన దుర్గాదాస్ ఉయికె ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన వెనక.. మెట్లపైన ఓ జంతువు వెళ్తూ కనిపించింది.
పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్’లో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్నారు. జూన్ 12న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.