Muda Scam Case: ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:07 PM
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో హైకోర్టు షాకిచ్చింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపి, పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపింది. పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 12న కేసు విచారణను పూర్తి చేసిన తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (muda) కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆమోదాన్ని సిద్ధరామయ్య ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.
గవర్నర్ విచారణ
మంగళవారం మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేసుపై తీర్పును వెలువరిస్తూ గవర్నర్ ఈ కేసును చట్ట ప్రకారం విచారించవచ్చని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. గవర్నర్ ఉత్తర్వు మేరకు ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గవర్నర్ చర్యలో ఎలాంటి లోపం లేదన్నారు. అంతకుముందు సిద్ధరామయ్య తరపున సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. దీంతో పాటు ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు స్నేహమయి కృష్ణ, టీజే అబ్రహం కూడా తమ వాదనలు వినిపించారు.
అప్పుడు ఉపశమనం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు మైసూరులోని ఒక ప్రధాన ప్రాంతంలో ముడా అక్రమంగా 14 ప్లాట్లను కేటాయించిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఆ క్రమంలో కర్ణాటక హైకోర్టు ఆగస్టు 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సిద్ధరామయ్యకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. దీంతో పాటు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను వాయిదా వేయాలని, గవర్నర్ ఇచ్చిన ఆమోదానికి అనుగుణంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి "చర్చల" తర్వాత అనుమతి లభించిందని ఆగస్టు 31న కర్ణాటక గవర్నర్ కార్యాలయం హైకోర్టుకు తెలిపింది.
నిరసన
కానీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో కర్ణాటక ప్రభుత్వ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసన చేపట్టారు. గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, అనేక ఇతర కేసులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదిలా ఉండగా, ఆరోపించిన ముడా కుంభకోణంపై పత్రాలతో పాటు వివరణాత్మక నివేదికను అందించాలని గవర్నర్ గెహ్లాట్ గత వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్‌ను కోరారు.
వాయిదా
ఈ నేపథ్యంలో కర్ణాటకలో భూ కేటాయింపుల కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో గవర్నర్ ఉత్తర్వులను సీఎం సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. విచారణను హైకోర్టు ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 19 మధ్యంతర ఉత్తర్వులను కూడా కోర్టు పొడిగించింది. ఇందులో సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఫిర్యాదుల విచారణను తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని ప్రత్యేక కోర్టును హైకోర్టు కోరింది.
ఇవి కూడా చదవండి:
NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Read More National News and Latest Telugu News