Share News

కలెక్టర్‌ అనుమతిలేనిదే కట్నం వేధింపుల కేసు చెల్లదు

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:02 AM

కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది.

కలెక్టర్‌ అనుమతిలేనిదే కట్నం వేధింపుల కేసు చెల్లదు

  • పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు

చండీగఢ్‌, ఆగస్టు 29: కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 8-ఏ ప్రకారం కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి అని న్యాయమూర్తి జస్టిస్‌ జస్జీత్‌ సింగ్‌ బేడీ స్పష్టం చేశారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి, శుభలేఖలు కూడా పంచిపెట్టిన తర్వాత రూ.25 లక్షలు కట్నంగా ఇస్తేనే వివాహం చేసుకుంటానంటూ బెదరిస్తున్నాడని ఆరోపిస్తూ కమల్‌జీత్‌ సింగ్‌ అనే వ్యక్తిపై సూర్జన్‌సింగ్‌ ఫిర్యాదు చేశాడు. దీనిపై పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా ఛాజ్లీ పోలీసు స్టేషన్‌ అధికారులు గత ఏడాది ఫిబ్రవరి 18న కేసు నమోదు చేశారు. అయితే జిల్లా కలెక్టర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోనందున ఈ కేసు చెల్లదంటూ కమల్‌జీత్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.

Updated Date - Aug 30 , 2024 | 04:02 AM