Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన
ABN , Publish Date - Aug 07 , 2024 | 10:04 AM
బంగ్లాదేశ్(Bangladesh)లో అల్లర్లు, సైనిక పాలన విధించడంతో వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వచ్చిన ఆ దేశ యువకులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కంగారుపడుతున్నారు. విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో హైదరాబాద్(Hyderabad)లో లభిస్తున్న అవకాశాల కారణంగా అనేకమంది నగరానికి వచ్చారు.
- తమవాళ్ల క్షేమం కోసం ఆరాటం
- వ్యాపారం, చికిత్సల కోసం వచ్చి ఇక్కడే ఉన్న పలువురు ఆ దేశస్థులు
హైదరాబాద్ సిటీ: బంగ్లాదేశ్(Bangladesh)లో అల్లర్లు, సైనిక పాలన విధించడంతో వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వచ్చిన ఆ దేశ యువకులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కంగారుపడుతున్నారు. విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో హైదరాబాద్(Hyderabad)లో లభిస్తున్న అవకాశాల కారణంగా అనేకమంది నగరానికి వచ్చారు. విహారయాత్రలు, వ్యాపారం, ఆరోగ్య అవసరాల కోసం నగరానికి వచ్చిన వారు తమ దేశంలో అశాంతి నెలకొనడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఫోన్లలో క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హత్యాయత్నం కేసు.. రెండేళ్ల తర్వాత హత్య కేసుగా.. అసలేం జరిగిందంటే..
బంగ్లాదేశ్(Bangladesh)లో సైనిక పాలనను తాము కోరుకోవడం లేదని, ప్రజాస్వామ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు. నగరంలో పలు యూనివర్సిటీల పరిధిలో పదుల సంఖ్యలో బంగ్లా విద్యార్ధులు ఇంజినీరింగ్, బీబీఏ, థియేటర్ ఆర్ట్స్ వంటి కోర్సులు అభ్యసిస్తుండగా, ఎక్కువమంది జేఎన్‌టీయూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. వీరితోపాటు వ్యాపారం, ఆరోగ్యం తదితర కారణాల కోసం నగరానికి వచ్చిన పలువురిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. వారి మాటల్లోనే..
ఆందోళనగా ఉంది..
- అరాఫత్ రహమాన్, సుచిత్ర దాస్, విద్యార్థులు
బంగ్లాదేశ్‌లో ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్ననే తమ వారితో మాట్లాడాం. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ తమ గురించి భయపడవద్దని చెప్పారు. అయినా అక్కడి పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది.
ఇప్పట్లో వెళ్లేది అనుమానమే..
- హెచ్‌సీయూ విద్యార్థి
బంగ్లాలో పరిస్థితులు వెంటనే చక్కబడాలి. మిలటరీ పాలన వద్దు. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడాలి. అశాంతిని ఎవరూ కోరుకోవడం లేదు. అక్కడి పౌరుల మరణం కలిచివేస్తోంది. త్వరలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తే బంగ్లా వెళ్లాలనుకుంటున్నా.
సోమవారం వెళ్లాల్సి ఉన్నా..
- అమీనుల్ ఇస్లాం
వ్యాపారం నిమిత్తం గత నెల 15న హైదరాబాద్ వచ్చా. ఈనెల 5న తిరిగి వెళ్లడానికి కోల్‌కతా వరకు ట్రైన్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యా. అదేరోజు బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా హింసాత్మక ఘటనలు తెలియడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా. 2-3 రోజులు పరిస్థితి గమనించి ఇంటికి వెళతా.
చికిత్స కోసం..
కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిట్టగాంగ్‌కు చెందిన రుక్సానా అనే మహిళ పంజాగుట్టలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెతోపాటు భర్త, కుమారుడు ఉన్నారు. అక్కడ చిట్టగాంగ్‌లో కుటుంబీకులు ఉన్నారని.. ఫోన్‌లో మాట్లాడుతున్నామన్నారు. మరో వారం పాటు ఇక్కడే ఉంటామని.. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే వెళ్లిపోతామన్నారు.
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!