PM Modi: నేను రక్షకుడను.. భగవంతుడే ఒక ప్రత్యేకమైన పనిమీద పంపించాడు
ABN , Publish Date - May 14 , 2024 | 05:03 PM
రాజ్యాంగాన్ని మార్చనున్నారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మంగళవారంనాడు నామినేషన్ వేసిన అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మోదీ సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని మార్చనున్నారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని (Protector) చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మంగళవారంనాడు నామినేషన్ వేసిన అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మోదీ సమాధానమిచ్చారు.
కాశీతో ప్రత్యేక అనుబంధం
'కాశీ' అనేది కేవలం ఒక మాట కాదని, అదొక భావోద్వేగమని వారణాసితో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ తెలియజేశారు. కాశీ ఎప్పటికీ చెక్కుచెదరదని, శతాబ్దాలుగా ఇది జనావాసంగా ఉందని చెప్పారు. గత పదేళ్లుగా కాశీతో తన అనుబంధం పెరుగుతూ వచ్చిందన్నారు. గంగా మాత అక్కున చేర్చుకుందనే అనుభూతి తనను ఎంతగానో ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలను, అప్పుడప్పుడు మధ్యలో ప్రసంగాన్ని ఆపి పెద్దలు, దివ్యాంగులు కనిపించినప్పుడు కనిపించినప్పుడు వారికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయమని కోరడంపై ప్రధాని మాట్లాడుతూ, ప్రజలతోనూ, వారి ఆలోచనతోనూ తాను కనెక్ట్ అవుతుంటానని చెప్పారు. జీవంలేని రోబోలా కేవలం ప్రసంగాలు ఇవ్వడం, పూర్తికాగానే వెళ్లిపోవడమనేది తన ప్రపంచం కాదని తెలిపారు.
PM Modi: ఎన్డీయే నేతలతో మోదీ బలప్రదర్శన...ఎవరేమన్నారంటే?
విపక్షాలు ఆడిపోసుకోవడంపై..
విపక్షాలు తనును ఆడిపోసుకోవడం (Hatred)పై మాట్లాడుతూ, ఇలాంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు. ''నేను ఎగ్జిట్ కాకముందే వాళ్లు ఇలాంటివి మొదలుపెట్టారు. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా వారు ఇదే తీరు కొనసాగిస్తారని అనుకుంటున్నాను'' అని వ్యాఖ్యానించారు. భగవంతుడు ఒక ప్రత్యేక పని మీద తనను పంపినట్టుగా భావిస్తుంటానని, తనకు అప్పగించిన పనని కొనిసాగిస్తూనే ఉంటానని మోదీ స్పష్టం చేశారు.
Read Latest Telangana News and National News