IMD: త్వరలో మరో 2 అల్పపీడనాలు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:35 AM
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి.
చెన్నై: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి. ఈ పరిస్థితులలో ఈ నెల 14, 20 తేదీల్లో బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, అదే జరిగితే భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. ఆ అల్పపీడనం వల్ల 14, 15 తేదీల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఇదే విధంగా ఈ నెల 20న కూడా మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Delhi: జమిలికి సై
3 జిల్లాల్లో కుండపోత...
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి(Tirunelveli, Thoothukudi, Tenkasi) జిల్లాలకు గురువారం రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక వాతావరణ కేంద్రం ఓ ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం మన్నార్ జలసంధి వైపు కదులుతుండటంతో సముద్రతీర జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ప్రత్యేకించి తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు.
భారీ వర్షసూచన కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, తిరువారూరు, రామనాధపురం, దిండుగల్, విల్లుపురం, పుదుకోట, మైలాడుదురై, తంజావూరు, కడలూరు, అరియలూరు, రాణిపేట, కరూరు, వేలూరు, తూత్తుకుడి, తిరుపత్తూరు, సేలం జిల్లాల్లో శుక్రవారం సెలవు ప్రకటించారు. తిరునల్వేలి జిల్లాలో 1 నుండి 5 తరగతులకు (ప్రాథమిక పాఠశాలలకు) సెలవు ప్రకటించారు. తిరువణ్ణామలై జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News