Share News

Himachal Pradesh: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. పార్టీ రాష్ట్ర విభాగాలు రద్దు

ABN , Publish Date - Nov 06 , 2024 | 09:19 PM

కాంగ్రెస్ పార్టీ 2019లోనూ ఇదే తరహా చర్యలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ అప్పట్లో రద్దు చేసింది. అయితే అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడో మాత్రం కొద్దికాలం కొనసాగారు. 2022లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ప్రతిభా సింగ్ నియమితులయ్యారు.

Himachal Pradesh: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. పార్టీ రాష్ట్ర విభాగాలు రద్దు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని పార్టీ రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసింది. పీసీసీ రాష్ట్ర విభాగం, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కమిటీలను సైతం రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈమేరకు ఒక ప్రకటనను బుధవారంనాడు విడుదల చేశారు.

కమలా హారిస్ ఓటమిని జీర్ణించుకోలేకున్న పూర్వీకుల గ్రామం


హిమాచల్ ప్రదేశ్ పీసీసీ రాష్ట్ర యూనిట్, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటన పేర్కొంది. ఆ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. మాజీ ముఖ్యమత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీ పునర్వవస్థీకరణలో భాగంగానే రాష్ట్ర విభాగాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రద్దు చేసినట్టు తెలుస్తోంది.


కాగా, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా చర్యలు తీసుకుంది. పార్టీ రాష్ట్ర యూనిట్ కాంగ్రెస్ అప్పట్లో రద్దు చేసింది. అయితే అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడో మాత్రం కొద్దికాలం కొనసాగారు. 2022లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా ప్రతిభా సింగ్ నియమితులయ్యారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేసులో ఆమె ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు దక్కింది.


ఇవి కూాడా చదవండి

PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

For More National and telugu News

Updated Date - Nov 06 , 2024 | 09:19 PM