Mallikarjun Kharge: 273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది..
ABN , Publish Date - May 18 , 2024 | 07:58 PM
లోక్‌సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
న్యూఢిల్లీ: లోక్‌సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ఆధిక్యం (leading)లో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ఓ జాతీయ ఛానెల్‌కు శనివారంనాడు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వాళ్లు (కేంద్రం) ఎంతగా తమను వేధించినప్పటికీ తాము ఈ ఎన్నికల్లో గెలువబోతున్నామని, ఎన్డీయే దారుణంగా చతికిలపడనుందని జోస్యం చెప్పారు. బీజేపీ చెబుతున్న '400 ప్లస్' లక్ష్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రతిచోటా వాళ్ల సీట్లు తగ్గిపోతున్నాయని తెలిపారు.
''ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రల్లోనూ బీజేపీ సీట్లు కోల్పోనుంది. కేరళ పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో వారికి ఉనికే లేదు. మేము (కాంగ్రెస్) ఒడిశాలో కూడా గెలువనున్నాం'' అని ఖర్గే చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సంక్షేమం ఏమాత్రం కేంద్రానికి పట్టడం లేదన్నారు.
Priyanka Gandhi: మేము బరిలో దిగితే.. ఆ పార్టీకి లాభం..?
వాళ్లకు డబ్బులున్నాయి, మాకు లేవు..
ఎన్నికల ప్రచారంపై ఖర్గే మాట్లాడుతూ, ప్రధానమంత్రికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని, కానీ తాను కొన్నిసార్లు హెలికాప్టర్‌లోనూ, మరికొన్ని సార్లు కమర్షియల్ విమానంలో ప్రయాణించాల్సి వస్తోందని, బీజేపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనీ, తమ వద్ద లేవని ఖర్గే అన్నారు. బీజేపీ హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతుందని, తాము ఆ పని చేయమని చెప్పారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై మాట్లాడుతూ, ప్రధానమంత్రి ప్రతీదీ తానొక్కడే చేయాలనుకుంటారని విమర్శించారు.
Read Latest National News and Telugu News