Jagdeep Dhankar: జగ్‌దీప్ ధన్‌ఖఢ్‌పై 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానం
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:58 PM
రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్‌దీప్ ధన్‌ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది.
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖఢ్ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎగువసభలోని 'ఇండియా' (INDIA) కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తీర్మానంపై ఇంతవరకూ 50 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు కూడా చెబుతున్నారు. రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలుస్తోంది.
PM Modi: ఎల్‌ఐసీ బీమా సఖి యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ
''అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) సిద్ధమైంది. 50 మంది ఎంపీలు కూడా సంతకాలు చేశారు. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నాయి'' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
విపక్ష నేతల అభియోగం
రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్‌దీప్ ధన్‌ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది. కేవలం అధికార పక్షం (ట్రెంజరీ బెంచ్) మాట్లాడేందుకే అవకాశం ఇచ్చి, విపక్ష నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వక పోవడమే కాకుండా వారికి క్లాస్ తీసుకుంటారని ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..