Indian students : యూకే వర్సిటీలా.. వద్దులే!
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:25 AM
యూకేలోని విశ్వవిద్యాలయాల్లో చేరడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి కనబర్చడం లేదు.
లండన్ నవంబరు 16: యూకేలోని విశ్వవిద్యాలయాల్లో చేరడానికి భారతీయ విద్యార్థులు ఆసక్తి కనబర్చడం లేదు. ఇప్పటికే పరిమిత బడ్జెట్లతో సతమతమవుతున్న వర్సిటీలకు ఈ ధోరణి శరాఘాతంలా మారింది. విద్యార్థులు తమ దరఖాస్తులను వాయిదా వేస్తుండటం వాటి ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచుతోందని ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్(ఓఎ్‌ఫఎస్) సంస్థ శుక్రవారం విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. 2022-23 నుంచి 2023-24 వరకూ యూకే వర్సిటీల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 1,39,914 నుంచి 1,11329కి తగ్గిందని తెలిపింది. ఇటీవల కొన్ని నగరాల్లో ఇమిగ్రేషన్ వ్యతిరేక అల్లర్లు జరగడం, పరిమిత ఉద్యోగావకాశాలు, భద్రతా పరమైన ఆందోళనలు దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.