IRCTC Website: హమ్మయ్య.. ఎట్టకేలకు పని చేస్తున్న రైల్వే వెబ్‌సైట్..
ABN , Publish Date - Dec 09 , 2024 | 12:47 PM
Indian Railways Ticket Booking: మెయింటెనెన్స్ కారణంగా నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ ఆన్‌సేవలు తిరిగి పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ..
Indian Railways Ticket Booking: మెయింటెనెన్స్ కారణంగా నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ ఆన్‌సేవలు తిరిగి పునరుద్ధరించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ సోమవారం ఉదయం కొన్ని గంటపాటు పనిచేయలేదు. దీంతో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడాని ప్రయత్నించిన వినియోగదారులు అవస్థలు పడ్డారు. మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ఇ-టికెటింగ్ సేవ చాలా సమయం పని చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తాము ఎదుర్కొంటున్న సమస్యను రైజ్ చేశారు కస్టమర్లు.
వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత వినియోగదారులు.. ‘మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా, తదుపరి ఒక గంట వరకు ఇ-టికెటింగ్ సేవ అందుబాటులో ఉండదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. రద్దు/ఫైల్ TDR కోసం, దయచేసి కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయండి. 14646, 0755-6610661 & 0755-4090600 లేదా etickets@irctc.co.inకి మెయిల్ చేయండి.’ అంటూ మెసేజ్ డిస్‌ప్లే అయ్యింది. దీంతో వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. సర్వర్ డౌన్ కారణంగా ఆన్‌లైన్ బుకింగ్, రద్దు, తత్కాల్ టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేశారు.
‘ఐఆర్‌సిటిసి యాప్‌ను రోజూ ఉపయోగించడం వల్ల స్లో మోషన్‌లో మారథాన్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ముగింపు సమయంలో ‘సెషన్ ఎక్స్‌పైర్డ్’ అనే సందేశం వస్తోంది.’ అంటూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పేర్కొన్నారు.
‘విశ్వంలోనే అత్యంత చెత్త యాప్ ఏదైనా ఉందంటే అదిIRCTC రైల్ కనెక్ట్ యాప్. అప్లికేషన్ చాలా నెమ్మదిగా ఉంది. తత్కాల్ బుకింగ్‌లను మొదటి ఐదు నిమిషాల పాటు చేయడానికి ఏజెంట్లను అనుమతిస్తారు. ఇలా సమయం పడుతుంటే తత్కాల్ టికెట్ బుక్ చేయడం దాదాపు అసాధ్యం టికెట్’ అని మరొక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వినియోగదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్‌సీటీసీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. సైట్ మెయింటెనెన్స్ కారణంగానే సర్వర్ డౌన్ అయ్యిందన్నారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మునుపటి మాదిరిగానే పని చేస్తుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఇప్పుడు వెబ్‌సేట్ సేవలను వినియోగించుకోవచ్చునని తెలిపారు.
Also Read:
చెన్నమనేని రమేష్‌కు బిగ్ షాక్
ఆస్తి కోసం కొట్లాట.. మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్..
For More National News and Telugu News..