‘యూఎస్ తలసరి’లో పావు వంతు చేరేందుకు భారత్‌కు 75 ఏళ్లు
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:04 AM
వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత్ సహా 100కు పైగా దేశాలు అధిక ఆదాయం కలిగిన దేశాలుగా మారడానికి తీవ్రమైన అవరోధాలను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా
న్యూఢిల్లీ, ఆగస్టు 2: వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత్ సహా 100కు పైగా దేశాలు అధిక ఆదాయం కలిగిన దేశాలుగా మారడానికి తీవ్రమైన అవరోధాలను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.
అలాగే అగ్రరాజ్యం అమెరికా తలసరి ఆదాయంలో భారత్ కేవలం పావు వంతును చేరుకోవడానికి దాదాపు 75 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. అదే చైనాకు అయితే పదేళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని, ఇండోనేషియాకు దాదాపు 70 ఏళ్లు పడుతుందని ‘వరల్డ్ డెవల్‌పమెంట్ రిపోర్ట్ 2024: ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేర్కొం ది. 2023 చివరినాటికి 108 దేశాలను మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించారు.
వీటి వార్షిక తలసరి జీడీపీ 1,136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల శ్రేణిలో ఉంది. ఈ దేశాల్లో 600 కోట్ల జనాభా ఉండగా.. ఇది ప్రపంచ జనాభాలో 75 శాతానికి సమానం. ఈ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నారు. వేగంగా వృద్ధాప్య జనాభా పెరుగుతుండటం, అప్పుల పెరుగుదల, భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ఘర్షణలు, పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడంలో ఇబ్బందులు వంటివి ఇందులో ఉన్నాయని పేర్కొంది.
చాలా మధ్య ఆదా య దేశాలు గత శతాబ్ద ప్లేబుక్నే వాడుతున్నాయని, ముఖ్యంగా పెట్టుబడులను విస్తరించడానికి రూపొందించిన విధానాలపై ఆధారపడుతున్నాయని నివేదిక పే ర్కొంది. ఇది ఫస్ట్ గేర్‌లో కారును నడుపు తూ వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించడం వంటిదని తెలిపింది.
పాత ప్లేబుక్కే కట్టుబడి ఉంటే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు శతాబ్దం మధ్య కాలానికి సహేతుకమైన సంపన్న సమాజాలను సృష్టించే పోటీని కోల్పోతాయని ప్రపంచ బ్యాంకు గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్, డెవల్‌పమెంట్ ఎకనామిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇం దెర్మిత్ గిల్ పేర్కొన్నారు. అధికఆదా యా నికి చేరుకోవడానికి దేశాలు అనుసరించాల్సిన వ్యూహాన్ని నివేదిక ప్రతిపాదించింది.