LokSabha: ఎంపీలుగా ప్రమాణం చేసిన.. రషీద్, అమృత్ పాల్
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:07 PM
లోక్‌సభలో కాశ్మీరి నేత ఇంజినీర్ రషీద్, ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృత్‌పాల్ సింగ్ సభ్యులుగా ప్రమాణం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు.
న్యూఢిల్లీ, జులై 05: లోక్‌సభలో కాశ్మీరి నేత ఇంజినీర్ రషీద్, ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృత్‌పాల్ సింగ్ సభ్యులుగా ప్రమాణం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలపై ఇంజినీర్ రషీద్‌ను గతంలో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్నారు. అలాగే నిషేధిత వారీస్ పంజాబ్ దే అధినేత అమృతపాల్. గతంలో జాతీయ భద్రత చట్టం కింద అరెస్టయ్యారు. దాంతో తన అనుచరులతో ఆయన అసోంలోని డిబ్రూఘర్ జైల్లో ఉన్నారు.
Also Read: Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!
అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరు విజయం సాధించారు. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి రషీద్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. తన ప్రత్యర్థి నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల ఆధిక్యంతో రషీద్ గెలుపొందారు. అలాగే పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా అమృత్ పాల్ సింగ్ పోటీ చేసి గెలిచారు.
Also Read: Viral Video: రీల్స్ కోసం.. ‘పిల్ల చేష్టలు’
మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన లోక్‌సభ సభ్యులు.. జూన్ 24, 25 తేదీల్లో ప్రమాణం చేశారు. దీంతో తాను ఎంపీగా ప్రమాణం చేయ్యాలని.. అందుకు అనుమతించాలని రషీద్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలో ఎంపీగా ఆయన ప్రమాణంపై ఏమైనా అభ్యంతరాలుంటే జులై 1వ తేదీ లోపు తెలియజేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. అయితే అందులో ఎటువంటి అభ్యంతరం లేదని డిల్లీ హైకోర్టుకు ఎన్ఐఏ స్పష్టం చేసింది. దీంతో జులై 5వ తేదీ రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు హైకోర్టు రెండు గంటల పేరోల్‌కు అనుమతి ఇచ్చింది. అలాగే అసోంలోని డిబ్రూఘర్ జైల్లోనున్న అమృత పాల్ సింగ్ పేరోల్‌పై నాలుగు రోజులు బయటకు వచ్చారు. దీంతో వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News