Share News

Jammu Kashmir Assembly Election: రేపు తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్దం

ABN , Publish Date - Sep 30 , 2024 | 09:36 PM

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Jammu Kashmir Assembly Election: రేపు తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్దం

శ్రీనగర్, సెప్టెంబర్ 30: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోంటున్నారు.

Viral Video: వామ్మో.. పాములను కంట్రోల్ చేస్తున్న రింగ్ మాస్టర్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


మరోవైపు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అదీకూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కడతాడనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Also Read: Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Also Read: Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..


ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌‌తో కాంగ్రెస్ పార్టీ జత కట్టి వెళ్తుంది. బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిలో హిజుబొల్లా నేత నస్రల్లా మృతి చెందారు. అందుకు నిరసనగా కాశ్మీర్‌లో ఇటీవల నిరనసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ తుది విడత పోలింగ్ వేళ భారీ కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..


మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌కు మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇఫ్పటికే సెప్టెంబర్ 18వ తేదీన తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. ఇక రెండో విడతలో 50 శాతం పోలింగ్ నమోదు జరిగింది.

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Also Read: Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బిగ్ రిలీఫ్


రేపు జరగనున్న పోలింగ్‌లో సైతం భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ మూడు విడత పోలింగ్‌ను వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పరిశీలించనున్నారు. ఇప్పటికే రెండో విడత పోలింగ్ వేళ.. పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ క్రమంలో ఓటర్లను సైతం వారు కలిసి...క్షేత్ర స్థాయిలో పరిస్థితలపై ఆరా తీసిన సంగతి తెలిసిందే.

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ.. తీహాడ్ జైల్లో ఉన్న ఇంజనీర్ రషీద్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన్ని బీజేపీనే బెయిల్ పై విడుదల చేయించిందంటూ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు.. తమ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు గుప్పించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి రషీద్ గెలిచిన విషయం విధితమే. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.

For National News And Telugu News..

Updated Date - Sep 30 , 2024 | 09:36 PM