Share News

JDU: ఆ విధానం సబబే.. మద్దతు తెలుపుతూ మాజీ రాష్ట్రపతికి జేడీ (యూ) వినతిపత్రం..

ABN , Publish Date - Feb 18 , 2024 | 04:00 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు విధానానికి వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని స్వాగతిసున్నాయి.

JDU: ఆ విధానం సబబే.. మద్దతు తెలుపుతూ మాజీ రాష్ట్రపతికి జేడీ (యూ) వినతిపత్రం..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు విధానానికి వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని స్వాగతిసున్నాయి. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమిలోకి తిరిగి వచ్చిన జనతాదళ్ (యూ) ఒక దేశం - ఒకే ఎన్నిక విధానానికి మద్దతు ఇచ్చింది. జేడీ(యూ) మాజీ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఝాలతో కూడిన బృందం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. వినతి పత్రం సమర్పించారు.

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలతో పాటు మునిసిపాలిటీలు, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించరాదని వినతి పత్రంలో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలు విడిగా నిర్వహించాలని కోరింది. సుపరిపాలన అందించేదుకు, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఏకకాల ఎన్నికలు ముఖ్యమని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం తగ్గుతుందని తెలిపారు. తద్వారా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చని కోవింద్ కు ఇచ్చిన వినతి పత్రంలో వివరించారు.


లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఆదేశించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 04:00 PM