Share News

Jharkhand: జార్ఖండ్‌లో ఇండియా కూటమి నేతగా ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Nov 24 , 2024 | 06:54 PM

జార్ఖండ్ కొత్త సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయింది. అంతకుముందు గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు.

Jharkhand: జార్ఖండ్‌లో ఇండియా కూటమి నేతగా ఏకగ్రీవ ఎన్నిక
JMM Chief Hemant Soren

రాంచీ, నవంబర్ 24: జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌ సంతోష్ గాంగ్వర్‌తో జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. ఆదివారం రాంచీలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం హేమంత్ సోరెన్.. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ వెంటనే సీఎం రాజీనామా లేఖను ఆయన ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని గవర్నర్‌ను హేమంత్ సోరెన్ కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో తాను నవంబర్ 28వ తేదీన.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని గవర్నర్‌కు హేమంత్ సోరెన్ తెలిపారు.

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు


ఈ భేటీ అనంతరం రాజ్‌భవన్ వెలుపల హేమంత్ సోరెన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని వెల్లడించారు. అలాగే ఇండియా కూటమి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీ నేతల సమక్షంలోనే గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లోని ఇండియా కూటమి అధినేతగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఆయనకు పార్టీ కేడర్ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దీంతో జార్ఖండ్ అసెంబ్లీలో తమ నాయకుడిగా తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.

Also Read: మహారాష్ట్రలో రేపే సీఎం, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం..!


జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. వీటికి రెండు విడుతలుగా.. అంటే నవంబర్ 13, 20వ తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఓటరు పట్టం కట్టారు. అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకు 34, కాంగ్రెస్ 16, ఆర్‌జేడీ 4, సీపీఐ ఎంఎల్ 2 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఈ కూటమికి మొత్తం 56 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఎన్డీయే కూటమికి చాలా తక్కువ స్థానాలు.. అంటే 24 స్థానాలు దక్కించుకుంది.

Also Read: జార్ఖండ్ గవర్నర్‌తో భేటీకానున్న సీఎం హేమంత్ సోరెన్


ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తమ నేతగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర గవర్నర్‌ను ఆయన కలిశారు. ఆ క్రమంలో తన సీఎం పదవికి చేసిన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. దీనిని గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

For National News And Telugu News

Updated Date - Nov 24 , 2024 | 07:01 PM