JK-Haryana Election Results 2024 LIVE: హరియాణాలో వినేష్ ఫోగట్ గెలుపు
ABN , First Publish Date - Oct 08 , 2024 | 08:11 AM
JK-Haryana Election Results 2024 LIVE Updates in Telugu:జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంమైంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో 65.65శాతం ఓటింగ్ నమోదైంది.
Live News & Update
-
2024-10-08T13:16:55+05:30
వినేష్ ఫోగట్ గెలుపు
హరియాణా: జులానాలో వినేష్ ఫోగట్ గెలుపు
యోగేష్ కుమార్ (BJP)పై ఫోగట్ విజయం
-
2024-10-08T12:57:57+05:30
హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం..!
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం హరియాణాలో బీజేపీ మరోమారు అధికారం చేపట్టనుందని తేలిపోయింది. ఈ విజయంతో హరియాణాలో హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ వచ్చిన సర్వేలన్నింటినీ పటాపంచల్ చేస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది బీజేపీ. హరియాణాలో బీజేపీ 49 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇతరులు 5 చోట్ల ముందంజలో ఉన్నారు.
-
2024-10-08T11:54:12+05:30
ఈసీపై సంచలన ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్..
ఢిల్లీ: ఈసిని టార్గెట్ చేసిన జైరాం రమేష్.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల మాదిరిగా హర్యానా ఎన్నికల ఫలితాలని ఆలస్యంగా అప్‌డేట్ చేస్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు.
ఎన్నికల అధికారులపై బీజేపీ ఒత్తిడి చేసేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
-
2024-10-08T10:53:46+05:30
ఫుల్ టెన్షన్‌లో కాంగ్రెస్ నేతలు..
ఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ - బీజేపీ పోటాపోటీ.
మొదటి రెండు గంటల్లో కాంగ్రెస్ లీడ్.
తర్వాతి రౌండ్లలో పుంజుకున్న బీజేపీ.
48 సీట్లలో బీజేపీ ఆధిక్యం.
34 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యం.
ఐఎన్ఎల్డి 1.
బీఎస్పీ 1.
స్వతంత్రులు 5.
క్షణక్షణానికి మారుతున్న హర్యానా ట్రెండ్.
జాట్ బెల్ట్‌లో బీజేపీ లీడ్.
కురుక్షేత్ర రీజన్‌లో కాంగ్రెస్ లీడ్.
టెన్షన్‌లో కాంగ్రెస్ నేతలు.
-
2024-10-08T10:48:33+05:30
అక్కడ కాంగ్రెస్.. ఇక్కడ బీజేపీ..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహరీ
హరియాణా: బీజేపీ 49, కాంగ్రెస్ 34
హరియాణాలో క్షణక్షణం మారుతున్న అంచనాలు
జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమి హవా
ఇండియా కూటమి -49, బీజేపీ-26, PDP-4
-
2024-10-08T09:29:29+05:30
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత లీడ్‌లో ఉందంటే..
కాంగ్రెస్ -49
బీజేపీ - 29
పీడీపీ - 4
ఇతరులు - 8
హర్యానా ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత లీడ్‌లో ఉందంటే..
కాంగ్రెస్ కూటమి - 46
బీజేపీ - 37
ఐఎన్ఎల్‌డీ - 3
జేజేపీ - 1
-
2024-10-08T09:00:19+05:30
కొనసాగుతున్న హరియాణా, జమ్మూకాశ్మీర్ ఓట్ల లెక్కింపు.
హరియాణాలో 60 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ.
జమ్మూ కశ్మీర్‌లో 40 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజ.
29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ.
5 స్థానాల్లో పీడీపీ, 11 స్థానాల్లో ఇతరులు ముందంజ
-
2024-10-08T08:41:48+05:30
లీడ్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్..
హరియాణా ఎన్నికల కౌంటింగ్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫోగట్.. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థిపై ముందంజలో ఉన్నారు.
-
2024-10-08T08:38:32+05:30
సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..
న్యూఢిల్లీ: హరియాణా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఎదుట స్వీట్లు పంచుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
-
2024-10-08T08:33:25+05:30
ఏ పార్టీ ముందంజ..?
హరియాణాలో కాంగ్రెస్ 26 స్థానాలు, బిజెపి 19 స్థానాలు, ఐఎన్ఎల్‌డి రెండు స్థానాలు, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజ
జమ్మూ కశ్మీర్‌లో 10 స్థానాల్లో బిజెపి ముందంజ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ 8 స్థానాల్లో ముందంజ.
-
2024-10-08T08:26:25+05:30
గట్టి ఫైట్ చేశాం: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్‌లో గట్టి పోరాటం చేశామని.. విజయం తమదేనని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు.
-
2024-10-08T08:11:51+05:30
JK-Haryana Election Results 2024 LIVE Updates in Telugu: జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంమైంది. హరియాణాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో 65.65శాతం ఓటింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1.. ఇలా మూడు దశల్లో పోలింగ్ జరిగింది. కౌటింగ్ నేపథ్యంలో ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హరియాణాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇవే నిజమైతే బీజేపీకి ఈ ఫలితాలు అతిపెద్ద షాక్ కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.