Share News

PM Modi: జార్ఖాండ్ అభివృద్ధికి గుదిబండ జేఎంఎం

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:02 PM

దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్‌ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పారు.

PM Modi: జార్ఖాండ్ అభివృద్ధికి గుదిబండ జేఎంఎం

రాంచీ: జార్ఖండ్‌ (Jharkhand)లో మెరుగైన సౌకర్యాలు, రైతుల సంక్షేమం, రాష్ట్రంలో పరిశ్రమల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జేఎంఎం ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి కూడా రెట్టింపు వేగంతో దూసుకుపోతుందని చెప్పారు. గఢవాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, జార్ఖాండ్ అభివృద్ధికి జేఎంఎం ప్రభుత్వం అడ్డుపడేందుకు ప్రయత్నించినప్పటికీ రాష్ట్ర మౌలిక వసతులపై పెద్దఎత్తున కేంద్రం దృష్టిసారించినట్టు చెప్పారు.


జార్ఖాండ్‌కు పటిష్టమైన రోడ్ల కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ పనులు సాగుతున్నాయని మోదీ చెప్పారు. జదదీశ్‌పూర్, హల్తిదాయ, బొకారో గ్యాస్ పైప్‌లైన్లతో రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు గ్యాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోదన్నారు. దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని మోదీ గుర్తుచేశారు. గఢవాలో ర్యాలీ అనంతరం రాంచీకి ప్రధాని వెళ్తారు. కాగా, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.


జార్ఖాండ్‌లో యూసీసీ

మరోవైపు, జార్ఖాండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బీజేపీ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని, అయితే, గిరిజనులను మాత్రం చట్టపరిధిలోకి తీసుకురామని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు, గనులతో నిర్వాసితులైన ప్రజలకు పునరావాసం కల్పించేందుకు డిస్‌ప్లేస్‌మెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.


ఇది కూడా చదవండి..

Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 04 , 2024 | 03:02 PM