Joe Biden : ప్రెసిడెంట్ అయ్యే అర్హత కమలస హ్యారిసకే ఉంది
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:20 AM
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
నాటో సమావేశం తర్వాత బైడెన్ వ్యాఖ్య
జెలెన్‌స్కీని పుతిన్ అంటూ పరిచయం
వాషింగ్టన్, జూలై 12: అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. గురువారం జరిగిన నాటో కూటమి దేశాల సదస్సు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కమలా హ్యారిస్ సమర్థురాలు. అందుకే ఆమెను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశాన’’ని తెలిపారు.
డెమోక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా అమెరికన్ల నుంచి బైడెన్ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలావుండగా, బైడెన్ మరోసారి నోరుజారారు.
కమలా హ్యరి్‌సనుద్దేశించి మాట్లాడే సందర్భంలో ఆయన పొరపాటున మాజీ అధ్యక్షడు ట్రంప్ పేరు ఉటంకించారు. అదేవిధంగా నాటో సభ్య దేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేస్తూ ‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్’’ అని సంభోదించారు. మరోవైపు, బైడెన్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో తాను న్యూరాలాజికల్ వైద్యపరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు.