Share News

Siddaramaiah: ముఖ్యమంత్రికి రూ.10 వేలు జరిమానా

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:08 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ కేసులో మార్చి 6న ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.2022లో కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగి రోడ్లు దిగ్బంధం చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది.ఖో

Siddaramaiah: ముఖ్యమంత్రికి రూ.10 వేలు జరిమానా

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) రూ.10 వేలు జరిమానా (Fine) విధించింది. ఈ కేసులో మార్చి 6న ప్రజాప్రతినిధుల కోర్టు (MP/MLA special court) ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, మంత్రులు ఎంబీ పాటిలవ్, రామలింగారెడ్డికి కూడా కోర్టు రూ.10,000 జరిమానా వేసింది. రామలింగారెడ్డిని మార్చి 7న, సూర్జేవాలాను మార్చి 11న, ఎంబీ పాటిల్‌ను మార్చి 15న ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 2022లో నిరసనలకు దిగి రోడ్లు దిగ్బంధం చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది.


కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలంటూ నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై నివాసాన్ని దిగ్బంధించేందుకు ప్రదర్శన నిర్వహించారనే కారణంతో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ సిద్ధరామయ్య హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా, ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చింది.

Updated Date - Feb 06 , 2024 | 09:08 PM