Congress: ఓటేయకుంటే కరెంట్ కట్ చేస్తాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హుకుం
ABN , Publish Date - May 02 , 2024 | 10:14 AM
"మా పార్టీకి ఓటేయకపోతే మీ కరెంట్ కట్ చేస్తాం" ఇదీ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) ఓటర్లను బెదిరించిన తీరు. తీవ్ర వివాదాస్పదమైన ఆయన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో రాజకీయ వేడిని రాజేశాయి.
బెంగళూరు: "మా పార్టీకి ఓటేయకపోతే మీ కరెంట్ కట్ చేస్తాం" ఇదీ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) ఓటర్లను బెదిరించిన తీరు. తీవ్ర వివాదాస్పదమైన ఆయన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో రాజకీయ వేడిని రాజేశాయి. సదరు వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చిక్కోడి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్.. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తామని జుగులాటోలో జరిగిన ఓ సమావేశంలో హెచ్చరించారు.
“మా పార్టీని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించకపోతే కరెంటు కట్ చేస్తాం. పక్కగా ఇది జరుగుతుంది”అని రాజు కేజ్ అన్నారు. కేజ్ ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చిక్కోడిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పరువు పోగొట్టుకున్నారు. ప్రధాని మోదీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
“మోదీ చనిపోతే.. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఎవరూ ప్రధాని కాలేరా? యువత ఎందుకు ఆయన వెంట పడుతోంది" అని కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మధ్యే మందాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఆయన రూ. 3 వేల కోట్ల విలువైన విమానంలో ప్రయాణిస్తున్నారని, రూ. 4 లక్షల విలువైన సూట్‌ను ధరిస్తారని కేజ్ ఆరోపించారు.
బీజేపీ ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, ఆ పార్టీ ' మొహబ్బత్ కీ దుకాన్ ' కాదని, ధమ్‌కీ కే భాయిజాన్ ' (థ్రెట్ మాస్టర్) అని విమర్శించారు.
For Latest News and National News click here