Dk Shiva Kumar : ‘ఉచిత బస్సు’పై ప్రధాని వ్యాఖ్యలు బాధాకరం
ABN , Publish Date - May 20 , 2024 | 03:53 AM
శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు.
బెంగళూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): శక్తి గ్యారెంటీ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో మెట్రో ఆదాయం తగ్గిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించడం బాధాకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. సమగ్ర సమాచారం లేకుండానే ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలో మెట్రోకు రూ.130 కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రయాణికుల సంఖ్య 30ు పెరిగిందన్నారు. కర్ణాటకలో కేవలం బెంగళూరులో మాత్రమే మెట్రో సేవలు ఉన్నాయనీ, శక్తి గ్యారెంటీ రాష్ట్రమంతా అమలులో ఉందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోందన్నారు.