Share News

IPS officer: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

ABN , Publish Date - Dec 02 , 2024 | 05:10 PM

చిన్న వయస్సులోనే ఐపీఎస్ సాధించాడు. తొలి పోస్టింగ్‌ ఉత్తర్వులు రావడంతో.. ఉద్యోగంలో చేరేందుకు ఆనందంతో బయలుదేరాడు. కానీ మనం ఒకటి తలిస్తే..దైవం ఒకటి తలచినట్లుగా అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

 IPS officer: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

సివిల్స్‌లో ఐఏఎస్, ఐపీఎస్.. లాంటి సర్వీసెస్‌‌ సాధించాలంటే కష్ట పడాలి. అది కూడా ఎంతగా అంటే ఓ విధంగా మహా యజ్ఞమే చేయాలి. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి.. ఆ తర్వాత మెయిన్స్‌‌లో ఉత్తీర్ణత సాధించాలి. అనంతరం ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. అప్పుడే ఐఏఎస్ కానీ.. ఐపీఎస్ కానీ .. మరే సర్వీస్ అయినా. అందుకే ప్రిలిమ్స్‌ పరీక్షకు లక్షల్లో హాజరై.. మెయిన్స్‌కు వేలల్లో పరీక్షలు రాసి.. ఇంటర్వ్యూల్లో వందల సంఖ్యల్లో మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఇక ఈ సర్వీస్ కొట్టాలంటే.. ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలంటారు సివిల్స్ సాధించిన విజేతలు. సివిల్స్ సాధించాలంటే.. దాదాపు ఏళ్లకు ఏళ్లు సాగే ఓ ప్రక్రియ.

Also Read: వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు.. ఎక్కడంటే..


harsha.jpg

సివిల్స్‌ కోసం కష్టపడి.. 26 ఏళ్ల వయస్సులోనే ఐపీఎస్ సాధించిన హర్షబర్ధన్ జీవితాన్ని కాలం చాలా కర్కశంగా కాటేసింది. 2023 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హర్షబర్దన్ శిక్షణ పొందాడు. తొలి పోస్టింగ్ రావడంతో.. బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తున్న అతడిని మృత్యు రూపంలో వాహనం కబళించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన హర్షవర్దన్‌కు కర్ణాటక కేడర్ కేటాయించింది కేంద్రం.

Also Read: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది


ఈ నేపథ్యంలో హాసన్ జిల్లాలో పోస్టింగ్ రావడంతో ఆయన పోలీస్ వాహనంలో బయలుదేరారు. అయితే హాసన్- మైసూర్ జాతీయ రహదారిపై కిట్ణని సమీపంలో.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం.. రహదారి పక్కనే ఉన్న ఇంటిని ఢీ కొట్టి.. అనంతరం చెట్టును ఢీకొంది.


దీంతో హర్షవర్ధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి..పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో హర్షవర్ధన్‌తోపాటు కారు డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో.. హర్షవర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కారు డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలు కావడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


మైసూర్‌లోని కర్ణాటక పోలీస్ అకాడమీలో ఇటీవల నాలుగు వారాల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. దీంతో అతడికి హోలెనర్సిపూర్‌ అసిస్టెంట్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తు.. తిరిగి రానీ లోకాలకు వెళ్లిపోయారు. ఐపీఎస్ హర్షవర్ధన్ దుర్మరణంపై సీఎం సిద్దరామయ్యతోపాటు మాజీ సీఎం సదానందగౌడ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

For National News And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 05:12 PM