Share News

Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:05 PM

మైసూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ తెలిపింది. ఇందుకు ప్రతిగానే మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది.

Karnataka: రోడ్డుకు సీఎం పేరు.. మండిపడిన విపక్షాలు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramiah)కు మరోసారి విపక్షాల నుంచి చుక్కెదురైంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ఒక ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. దీనిపై విపక్ష జనతా దళ్ (సెక్యులర్) తాజాగా విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య అవినీతి ఆరోపణలపై కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో జేడీఎస్ ఒక పోస్టు పెట్టింది.

PM Modi: కెన్-బెత్వా నధుల అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ


''చారిత్రక మైసూరు నగరంలోని కెఆర్ఎస్ రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్య మార్గ్ అనే పేరు పెట్టాలని మైసూరు మెట్రోపాలిటన్ కార్పొరేష్ తీసుకున్న నిర్ణయం గర్హనీయం. ముడాలో అక్రమంగా స్థలం పొంది, మోసానికి పాల్పడిన కేసులో సిద్ధారమయ్య ఏ1 నిందితుడు. కోర్టు, లోకాయుక్త విచారను ఆయన ఎదుర్కొంటున్నారు'' అని జేడీఎస్ పేర్కొంది.


మైసూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికైన బోర్డు కాదని, అధికారులను రాష్ట్ర ప్రభుత్వమే నియమించిందని జేడీఎస్ తెలిపింది. ఇందుకు ప్రతిగానే మైసూరు సిటీ రోడ్డుకు సిద్ధారమయ్య పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదన చేసినట్టు పేర్కొంది. ముడా భూములను మింగేసిన అవినీతి ముఖ్యమత్రి పేరును ఒక రోడ్డుకు పెట్టడం అంటే మైసూరు సిటీని, రాష్ట్రాన్ని అవమానించడమే అవుతుందని అభ్యంతరం తెలిపింది. మెటగల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్కిల్, రాయల్ ఇన్ జంక్షన్ మధ్య ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనగా ఉంది.


ఇది కూడా చదవండి..

Arvind Kejriwal: త్వరలోనే అతిషిని అరెస్టు చేస్తారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Bengaluru: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఐదుగురికి బెయిల్‌

For National News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 05:05 PM