Share News

Bangalore: రైతును అవమానించిన జీటీ మాల్‌కు 7 రోజులు తాళం: కర్ణాటక మంత్రి వెల్లడి

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:34 AM

రైతును అవమానించిన బెంగళూరులోని జీటీ మాల్‌కు ఏడు రోజుల పాటు తాళం వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని కర్ణాటక రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి భైరతి సురేశ్‌ తెలిపారు.

Bangalore: రైతును అవమానించిన జీటీ మాల్‌కు 7 రోజులు తాళం: కర్ణాటక మంత్రి వెల్లడి

బెంగళూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): రైతును అవమానించిన బెంగళూరులోని జీటీ మాల్‌కు ఏడు రోజుల పాటు తాళం వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని కర్ణాటక రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి భైరతి సురేశ్‌ తెలిపారు. హావేరి జిల్లాకు చెందిన నాగరాజు, తన తండ్రి పకీరప్పతో కలిసి జీటీ మాల్‌కు వెళ్లారు. పకీరప్ప పంచెకట్టుతో ఉండటంతో జీటీ మాల్‌కు వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే.


దీంతో కన్నడ సంఘాలు, రైతుసంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. దీంతో మాల్‌ యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పింది. అవమానానికి గురైన రైతును పిలిపించి సత్కరించింది. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే రైతును అవమానించిన సంఘటనను కాంగ్రెస్‌ సభ్యులు ప్రస్తావించారు. దీంతో నగరాభివృద్ధి శాఖ మంత్రి భైరతి సురేశ్‌ స్పందించారు.

Updated Date - Jul 19 , 2024 | 05:34 AM