Share News

Farooq Abdullah: పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:03 PM

జమ్మూకశ్మీర్‌లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్‌ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.

Farooq Abdullah: పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా స్ట్రాంగ్ వార్నింగ్

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్‌ (Pakistan) ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు. కశ్మీర్‌ ఎప్పుటికీ పాకిస్థాన్‌లో భాగం కాదని అన్నారు. తమ భూభాగంపై ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్‌ను హెచ్చరించారు.

కశ్మీర్‌లో ఉగ్రదాడి


''పాకిస్థాన్‌ నాయకత్వానికి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఇండియాతో మంచి సంబంధాలు కోరుకుంటే ఉగ్రవాదాన్ని విడనాడాలి. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు. 75 ఏళ్లుగా కానిది ఇప్పుడు ఏమవుతుంది? మమ్మల్ని గౌరవంగా బతకనీయండి, విజయపథంలో ముందుకు సాగనీయండి'' అని ఫరూక్ అబ్దుల్లా హితవు పలికారు. ఉగ్రవాదానికి చరమగీతం పాడేందుకు ఇదే తగిన సమయమని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ''అమాయకులైన మా ప్రజలను చంపుకుంటూ పోతే చర్చలు ఎలా జరుగుతాయని అనుకుంటున్నారు?'' అని దాయాది దేశం పాక్‌ను నిలదీశారు.


గందేర్‌బల్ జిల్లాలోని శ్రీనగర్-లెహ్ నేషనల్ హైవే సమీపంలో టన్నెల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంపై ఉగ్రవాదులు ఆదివారంనాడు తెగబడటంతో ఒక డాక్టరు, ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు, ఒక వైద్యుడు ప్రాణాలు కోల్పోయారని, ఇందువల్ల ఉగ్రవాదులు సాధించేదేమిటని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ''ఇక్కడ మరో పాకిస్థాన్‌ను సృష్టించాలని మీరు అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. ఇలాంటి దురాగతాలకు గట్టిగా తిప్పికొట్టే్ందుకు శక్తివంచన లేకుండా మేము ప్రయత్నిస్తాం'' అని అన్నారు.


అమిత్‌షా ఖండన

కాగా, ఈ ఉగ్రవాద ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుశ్చర్యలను మన భద్రతా బలగాలకు గట్టి సమాధానం ఇస్తాయన్నారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మరోవైపు, ఉగ్రదాడిపై విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (NIA) కశ్మీర్‌కు చేరుకుంది.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 21 , 2024 | 03:03 PM