Share News

Kerala Man: కూతురు కోసం మొబైల్ కొనుగోలు.. అంతలోనే ఇలా ..!!

ABN , Publish Date - Jun 13 , 2024 | 09:10 PM

ప్లస్ టు లో కూతురికి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చి నర్సింగ్ కోర్సులో చేర్పించాలని అనుకున్నాడు. పై చదువు చదివే బిడ్డకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. ఆ ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Kerala Man: కూతురు కోసం మొబైల్ కొనుగోలు.. అంతలోనే ఇలా ..!!
kuwait fire accident

కొల్లం: ప్లస్ టు లో కూతురికి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చి నర్సింగ్ కోర్సులో చేర్పించాలని అనుకున్నాడు. పై చదువు చదివే బిడ్డకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. ఆ ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.


భార్య, పిల్లలు

కేరళలో గల కొల్లంకు చెందిన లూకోస్‌కు భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. గత 18 ఏళ్ల నుంచి అతను కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతని పెద్ద కూతురు ప్లస్ టు ఇటీవల పూర్తయ్యింది. మంచి మార్కులు వచ్చాయని తెలిసి సంతోష పడ్డారు. వచ్చె నెలలో ఇండియా వెళుతున్నాడు. కూతురి కోసం ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. బెంగళూర్‌‌లో మంచి నర్సింగ్ కాలేజీలో చేర్పించాలని అనుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. కువైట్‌లో జరిగిన ప్రమాదంలో లూకోస్ చనిపోయాడు. అతని మృతిని పోలీసు అధికారులు బుధవారం సాయంత్రం ధృవీకరించారు.


చెలరేగిన మంటలు

కువైట్‌ మంగాఫ్ నగరంలో ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఆ భవనంలో కేరళ, తమిళనాడుకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. పొగ వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. 49 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో లూకోస్ కూడా ఉన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 09:10 PM