Share News

Lok Sabha Elections: కేరళ తీర్పు.. వయా వయనాడ్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:34 AM

దేవుడి సొంత నేల.. కొబ్బరి నేల.. చైతన్యానికి నెలవైన కేరళ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు పదిహేను సీట్లతో పట్టం కట్టిన మలయాళీలు.. అధికార లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఒక్క స్థానానికే పరిమితం చేశారు.

Lok Sabha Elections: కేరళ తీర్పు.. వయా వయనాడ్‌
Lok Sabha Elections 2024

  • జాతీయ స్థాయిలో కాంగ్రెస్, లెఫ్ట్ దోస్తీ.. ఇక్కడ కుస్తీ.. వయనాడ్ నుంచి పోటిలో రాహుల్

  • ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా భార్య అన్నీ రాజా సవాల్‌

(సెంట్రల్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమరంలో మాత్రం హస్తాన్ని పక్కనపెట్టి వామపక్ష ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారు. ఇప్పటి విషయానికి వస్తే.. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండి యా కూటమిలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలు. కేరళలో మాత్రం ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వయనాడ్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత, సిటింగ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని సాక్షాత్తు సీపీఐ జాతీయ కార్యదర్శి ఎ.రాజా భార్య అన్నీ రాజా సవాల్‌ చేస్తుండడమే దీనికి నిదర్శనం. పరస్పరం ఢీకొంటే దిగితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని లెఫ్ట్‌ వారించినా.. కాంగ్రెస్‌ రాహుల్‌నే అభ్యర్థిగా ప్రకటించింది.


ఈ ఘర్షణ జాతీయ స్థాయిలో ఆసక్తితో పాటు ఇండియా కూటమిలో అపనమ్మకాన్నీ కలిగించింది. కూటమిలో లుకలుకలను బయటపెడుతూ కేరళ రాజకీయాల్లో పాగాకు బీజేపీ చేస్తున్న పోరాటానికి మార్గం సుగమం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికితగ్గట్లే లెఫ్ట్‌, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ‘దిల్లీ మే దోస్తీ.. కేరళ మే కుస్తీ’ నినాదాన్ని ప్రస్తావించారు. కాగా, కేరళలో కాంగ్రెస్‌, వామపక్షాలు పరస్పర పోటీ, బయట పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్ర ఓటర్లలో ఎలాంటి అయోమయం లేదని.. ఇండియా నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర, జాతీయ ఎన్నికల మధ్య తేడాను గుర్తించే పరిపక్వత వారికి ఉందని అంటున్నారు.

రాహుల్‌, కేసీ, థరూర్‌..

2019లోనే వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వామపక్షాలు ఈసారి కూడా అదే ధోరణి కనబరిచాయి. సురక్షిత స్థానం కావాలనుకుంటే మరో దక్షిణాది రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించాయి. దూరదృష్టి లేని కేరళ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ను పోటీ చేయాలంటూ బలవంతం చేశారని సీపీఐ ఆరోపించింది. మిత్రపక్షాల అభ్యర్థిగా రాహుల్‌ ఒక్కరే బరిలో నిలవాల్సి ఉండగా.. అన్నీ రాజా పట్టుబట్టడంతో కాదనలేని పరిస్థితి ఏర్పడింది.కాగా, వయనాడ్‌లో బీజేపీ తరఫున ఆ పార్టీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ బరిలో ఉన్నారు. ఈ స్థానంలోనే కాక.. అలప్పుళ కూడా లెఫ్ట్‌, కాంగ్రెస్‌ మధ్య మంటలు రేపుతోంది.


ఇక్కడ సీపీఎం ఎంపీ ఏఎం ఆరి్‌ఫతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడైన కేసీ వేణుగోపాల్‌ తలపడుతున్నారు. అలప్పుళ నుంచి కేసీ రెండుసార్లు (2009, 2014) గెలిచారు. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌తో కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ తలపడుతున్నారు. కాగా, ఎన్నికల్లో పోటీపరంగానే కాక.. కాంగ్రె్‌స-లెఫ్ట్‌ సైద్ధాంతికంగానూ తలపడ్డాయి. ముస్లింలకు సంబంధించిన విషయాల్లో కాంగ్రెస్‌ మొండి వైఖరిపై వామపక్షాలు ప్రధానంగా ఆరోపణలు చేశాయి. అయోధ్య, ఆర్టికల్‌-370 రద్దు అంశాల్లో కాంగ్రెస్‌ సాఫ్ట్‌ హిందుత్వ వైఖరిని అవలంబించిందని సీపీఎం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా.. కేరళ బయట తాము సాఫ్ట్‌ హిందుత్వతో ఉంటే.. రాజస్థాన్‌లో సీపీఎం తమ మద్దతు ఎందుకు తీసుకుంటోందని కాంగ్రెస్‌ నిలదీసింది.

త్రిముఖ పోరులో రాహుల్‌ వైపే మొగ్గు..

గత ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా మార్మోగిన వయనాడ్‌లో రాహుల్‌ 4.37 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. వయనాడ్‌ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల ముస్లింలదే ఆధిపత్యం. వీరిలో అత్యధికం కాంగ్రె్‌సకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు రాహుల్‌, అన్నీ, సురేంద్రన్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయితే, గెలవడం అంత సులువు కాదని తెలిసిన వామపక్షాలు.. రాహుల్‌ ఆధిక్యాన్ని వీలైనంత తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, సురేంద్రన్‌ కూడా పెద్దఎత్తున ప్రచారం చేశారు.


అందరి కన్నూ మైనారిటీలపైనే!

కేరళలో మైనారిటీల ఓట్లే కీలకం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవులు కలిపి 44.9ు వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు కూడా. లోక్‌సభ ఎన్నికల్లో వీరి ఓట్ల కోసం పాలక లెఫ్ట్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌), విపక్ష యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఏకంగా 19 స్థానాలను కైవసం చేసుకుంది.

లెఫ్ట్‌కు ఒక్కటే దక్కింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రివర్స్‌ అయింది. ప్రజలు అనూహ్యంగా పినరయి విజయన్‌ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌కు రెండోసారి అధికారం కట్టబెట్టారు. కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారిపోవడం రివాజుగా వస్తోంది. విజయన్‌ దానిని బద్దలు కొట్టారు. ముస్లింలు, క్రైస్తవులు ఆయన నాయకత్వం వైపు మొగ్గుచూ పారు. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ విజయపరంపర కొనసాగించాలని ఎల్‌డీఎఫ్‌ భావిస్తోంది. అటు యూడీఎఫ్‌ కూడా రాహుల్‌ సారథ్యంలో మళ్లీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

For More National and Telugu News..

Updated Date - Apr 26 , 2024 | 08:41 AM