Share News

Lok Sabha Elections: ఖర్గేను కాంగ్రెస్ సాగనంపడం ఖాయం.. అమిత్‌షా జోస్యం

ABN , Publish Date - May 27 , 2024 | 06:17 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ఉద్యోగం కోల్పోనున్నారని కేంద్ర హోం మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్‌షా జోస్యం చెప్పారు.

Lok Sabha Elections: ఖర్గేను కాంగ్రెస్ సాగనంపడం ఖాయం.. అమిత్‌షా జోస్యం

ఖుషీనగర్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తన ఉద్యోగం కోల్పోనున్నారని కేంద్ర హోం మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్‌షా (Amit Shah) జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఖుషీనగర్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఓటమికి ఆ ఇద్దరి కవలలను (Rahul-Priyanka) బాధ్యులను చేయరని, వారిపై ఎలాంటి నింద రాకుండా ఖర్గేనే బాధ్యుడిని చేసి ఆయనను ఉద్యోగం (Congress President) నుంచి తొలగిస్తారని, ఈ విషయాన్ని ఖర్గే గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ మనుషులు ఎన్నికల అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈవీఎంల వల్లే తాము ఎన్నికల్లో ఓడిపాయమని కూడా అంటారని అమిత్‌షా చెప్పారు.

Rajokot Gaming Zone fire: గుజరాత్ సర్కార్‌పై శివాలెత్తిన హైకోర్టు


310 సీట్లు దాటేశాం..

ఐదు విడతల పోలింగ్‌పై వివరాల తన వద్ద వద్ద ఉన్నాయని, ఆ ప్రకారం ఐదు విడతలు పూర్తయ్యేసరికి ప్రధాని మోదీ 310కి పైగా సీట్లు సొంతం చేసుకున్నారని చెప్పారు. రాహుల్‌ 40 దాటరని, అఖిలేష్‌ యాదవ్‌కు 4 సీట్లు కూడా రావని అన్నారు. ఈ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల్లో పుట్టి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మోదీ ఒకవైపు, వెండి స్పూన్‌తో పుట్టి, పూర్వాంచల్ సమస్యలు ఏమాత్రం తెలియని ఇద్దరు యువరాజులు (రాహుల్, అఖిలేష్) మరోవైపు ఉన్నారని అన్నారు. బీఎస్‌పీ చీఫ్ మాయావతి, అఖిలేష్ యాదవ్ హయాంలో అనేక చక్కెర మిల్లులు మూతపడ్డాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 20 చక్కెర మిల్లులను తిరిగి తెరిచిందని చెప్పారు. విపక్షాలు దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల రిజర్వేషన్లను ఊలలాక్కుని ముస్లింలకు ఇవ్వాలvf అనుకుంటున్నాయని, వారి ఆటలను బీజేపీ ఎంతమాత్రం సాగనీయదని అన్నారు. మొత్తం ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 7వ విడత పోలింగ్ జూన్ 1న జరుగనుంది. ఇందులో భాగంగా యూపీలోని ఖుషీనగర్ సహా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది.

Updated Date - May 27 , 2024 | 06:27 PM